Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన బీసీ సంఘ నేతలు
న్యూఢిల్లీ: ఓబీసీ సమస్యల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం స్టేట్ కోఆర్డినేటర్ కొప్పుల చందు గౌడ్ మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో బీసీ సమస్యలపై పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం కిషన్‌రెడ్డిని కలిసిన సంఘనేతలు.. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనీ, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. జనగణన లో కుల గణన చేపట్టాలనీ,క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని విన్నవించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని,సామాజిక న్యాయాన్ని పాటించి బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాలలో సముచిత న్యాయం కల్పించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు.కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీసీల సమస్యల పట్ల మోడీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని బీసీలు ఎవరు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లో శ్యాం కన కాల, విక్రం గౌడ్, లింగం గౌడ్,రావులకొల్ నరేష్, విజరు గౌడ్ మల్లికార్జున్,మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.