Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండ్లిండ్ల డిమాండ్‌తో ఆరేండ్ల గరిష్టానికి..
- గతేడాది 350 ఇంపోర్ట్ కాగా...ఈ ఏడాది 900 టన్నులు..
న్యూఢిల్లీ: ''దేశంలో పెండిండ్ల సీజన్ నేపథ్యంలో బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతుంది. దీంతో దిగుమతులు ఆరేండ్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఈ ఏడాది నవంబర్ మధ్య నాటికి దేశంలో 25 లక్షల పెండ్లిండ్లు జరగొచ్చని అంచనా. ఈ సంఖ్య మొత్తం ఏడాదిలో జరిగే శుభకార్యక్రమాల్లో 25 శాతం'' అని నిపణులు పేర్కొంటున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ అమాంతం పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణంకాల ప్రకారం.. పండగ సీజన్ అమ్మకాలకు తోడు పెండిండ్లు కలిసి రావడంతో ఈ ఏడాది 900 టన్నుల బంగారం దిగుమతి కావొచ్చని అంచనా. గతేడాది ఇది 350 టన్నులుగా నమోదయ్యింది. బంగారం ధరలు తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరుగుతుందని ముంబయి కేంద్రంగా పని చేస్తున్న కన్సల్టెంట్ చిరాగ్ సేత్ పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే వినియోగదారులు బంగారంపై ఆసక్తి పెంచుకుంటున్నారన్నారు. ''గతేడాది కరోనా సంక్షోభంతో అనేక పెండిండ్లు వాయిదా పడ్డాయి. మళ్లీ వైరస్ భయాలు పెరుగుతున్నాయి. దీంతో కొంత మంది ముందే పెండ్లిండ్లు చేసుకుంటున్నారు.'' అని లక్నో కేంద్రంగా పని చేస్తోన్న జుగల్ కిశోర్ జ్యువెల్లర్స్ డైరెక్టర్ తన్యా రాష్ట్రోగి పేర్కొన్నారు. ఈ కాలంలో పసిడిపై పెట్టుబడులకు, అభరణాల కొనుగోళ్లకు చాలా మంది ఆసక్తిగా చూపుతున్నారన్నారు. దీంతో దిగుమతులు భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. వినియోగదారుల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. దీర్ఘకాలంలో భారత మార్కెట్లో ఈ లోహానికి మరింత డిమాండ్ నెలకొననుందని పేర్కొన్నారు.