Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే 14 ప్రాజెక్టులకు 9243 కోట్లకు కేటాయింపు
- పీపీపీ మోడల్లో మరిన్ని ప్రాజెక్టులు : భారత రైల్వే
న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని ప్రాజెక్టులను పబ్లిక్ ప్రయివేటు పార్టనర్షిప్(పీపీపీ) మోడల్ ద్వారా పూర్తి చేయడానికి భారతీయ రైల్వే ప్రణాళికలు రచిస్తున్నది. పీపీపీ మోడల్ ఫలితాలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల లోక్ సభలో వివరాలను తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో రూ. 9243 కోట్ల విలువైన 14 రైలు ప్రాజెక్టులు పీపీపీ విధానంలో పూర్తయ్యాయని ఆయన చెప్పారు. పీపీపీ విధానం ద్వారా బొగ్గు కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులతో సహా రూ. 19,417 కోట్లతో మరో పది ప్రాజెక్టులు ఇప్పటికే అమలులో ఉన్నాయన్నారు. ''14 ప్రాజెక్టుల పూర్తి తర్వాత, రూ. 13,971 కోట్ల విలువైన మరో ఏడు రైలు ప్రాజెక్టులకు భారత రైల్వే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అవి ఇప్పుడు అభివృద్ధి దశలో ఉన్నాయి. ప్రాజెక్టుల సంఖ్య సకాలంలో పూర్తవుతున్నందున పీపీపీ మోడల్లో మరిన్ని ప్రాజెక్టులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి '' అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.