Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ మిషన్.. 2022కి తాకిన నిరసన జ్వాల
- యూపీ లక్నో ఎన్నికల ప్రచారంలో స్థానికుల నిలదీత
- ఆందోళనకారులపై ఖాకీల ఉక్కుపాదం
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పరా భవం తప్పదనే సంకేతాలు కమలం పార్టీని భయపెడుతున్నాయి. ఓ వైపు ప్రధాని మోడీ మత రాజకీయం చేసేదిశగా.. శిలాఫలకాలు, శంకుస్థా పనలు చేస్తున్న విషయం విదితమే. మరోవైపు మిషన్2022కి రంగంలోకి దిగిన కేంద్ర హౌంమంత్రి అమిత్ షాకు పరాభవంఎదురైంది.శుక్రవారం లక్నో పర్యటనకు వచ్చిన అమిత్‌షా సహకార భారతి ఏడవ వార్షిక సదస్సుకు హాజరవడంతో పాటు బీజేపీ, నిషాద్ పార్టీ సంయుక్త ర్యాలీలో ప్రసంగించేలా ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్ మైదానంలో జరగనున్న 'సర్కార్ బనావో, అధికార్ పావో' ర్యాలీ అత్యంత కీలకంగా భావించింది. జనాన్ని తరలించింది. ఒక్క సారిగా మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేయటం మొదలుపెట్టారు. ఓబీసీ కులగణన, ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో అక్రమా లపై నిగ్గుతేల్చాలంటూ.. పోస్టర్లు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమిత్‌షా మాట్లాడటానికి ఉపక్రమించగానే.. యోగి,మోడీ సర్కార్లకు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనకు దిగారు.దీంతో అమిత్‌షా షాక్‌కు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకోవటానికి రెచ్చిపోయారు. చొక్కాలు పట్టుకుని వారిపై కండకావరం ప్రదర్శించారు.వారిని పలు పోలీస్స్టేషన్లకు తరలించారు. దీన్నిబట్టి చూస్తే...యూపీలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు గా ఉన్నదని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.యోగి సర్కార్ చేసిన అరాచకాలు, రాష్ట్ర ప్రజల్ని నిర్లక్ష్యం చేశారనీ, దీనికి వ్యతిరేకంగా మరిన్ని నిరసనల్ని మోడీ, అమిత్‌షాలు ఎదుర్కొకతప్పదని వారు పేర్కొంటున్నారు.