Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు మాసాలుగా ఒత్తిడిలో మార్కెట్లు
- కొత్తగా ఒమ్రికాన్ బెంబేలు
- సెన్సెక్స్ 889 పాయింట్ల పతనం
ముంబయి: గడిచిన రెండు నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవడంతో మదుపర్లు లక్షల కోట్ల నష్టాల పాలయ్యారు. క్రితం కరోనా సంక్షోభంలోనూ రికార్డ్ లాభాలను నమోదు చేసిన సూచీలు.. ఇటీవల దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లడం, ఒమిక్రాన్ భయాలతో మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. ఇదే క్రమంలో శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో 56,951 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. రిలయన్స్, విత్త సూచీలు అధిక నష్టాలు చవి చూశాయి. తుదకు సెన్సెక్స్ 889 పాయింట్లు క్షీణించి 57,011కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 263 పాయింట్లు కోల్పోయి 16,985 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 16,966 కనిష్టానికి పడిపోయింది. గడిచిన ఏడు వరుస సెషన్లలో కేవలం గురువారం మాత్రమే స్వల్ప లాభాలు నమోదు చేయగా.. మిగితా ఆరు సెషన్లలోనూ నష్టాలు చవి చూశాయి. అమ్మకాల ఒత్తిడితో గడిచిన రెండు మాసాల్లో బీఎస్ఈలో మదుపర్ల సంపద రూ.15.3 లక్షల కోట్లు ఆవిరయ్యింది. ప్రస్తుత వారంలోనే రూ.8.3 లక్షల కోట్లు నష్టపోయారు. డిసెంబర్ 10న బీఎస్ఈ మార్కెట్ కాపిటలైజేషన్ విలువ రూ.267.68 లక్షల కోట్లుగా ఉండగా.. డిసెంబర్ 17 నాటికి ఇది రూ.259.4 లక్షల కోట్లకు పడిపోయింది.