Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
- ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ అడవుల్లో ఘటన
నవతెలంగాణ-చర్ల
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా గోండ్రాస్ దండకారణ్యంలో మావోయిస్టులకు, డీఆర్జి బలగాలకు మధ్య శనివారం ఎదురు కాల్పులు జరిగాయి. హిద్మే కొహ్రామ్తో పాటు మరో మహిళా మావోయిస్టు పొజ్జె మృతిచెందినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గోండ్రాస్ గుట్టల వద్ద మావోయిస్టులు రహస్య సమావేశం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. దాంతో డీఆర్జి బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడ్డారు. లొంగి పొమ్మని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా కాల్పులు జరపగా, ఆత్మరక్షణ కోసం డీఆర్జీ బలగాలు సైతం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. అనంతరం సెర్చ్ ఆపరేషన్లో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలు ఘటనా స్థలంలో లభ్యమయ్యాయి. ఇద్దరిలో ఒకరైన హిద్మే కొహ్రామ్ తలపై రూ.5 లక్షలు రివార్డు ఉంది. ఆమె దర్భా డివిజన్ మల్లంజర్ కమిటీ సభ్యురారు. మరో మహిళా మావోయిస్టు పొజ్జెపై రూ.లక్ష రివార్డు ఉంది. ఆమె దర్భా డివిజన్, మల్లెంజర్ ఏరియా కమిటీ, నీలవాయి కమిటీ ఇన్ఛార్జ్, ఎన్ఎం ఏరియా సభ్యురాలిగా ఉన్నారు. స్థానికంగా తయారైన మూడు రైఫిళ్లు, మందుగుండు సామగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్య స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ ధ్రువీకరించారు. పరారీలో ఉన్న, గాయపడిన మావోయిస్టుల కోసం అన్వేషణ కొనసాగుతోందన్నారు.