Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హక్కుల కార్యకర్త, ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన రోనా విల్సన్‌పై కేంద్రం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో నిఘా వ్యవహారాలు సాగించిందని తేలింది. అరెస్టు చేయకముందు(జూన్, 2018) ఆయన ఐఫోన్‌ను పెగాసస్‌తో హ్యాకింగ్ చేశారని డిజిటల్ ఫోరెన్సిక్ నివేదికలో బయటపడింది. కేరళకు చెందిన రోనా విల్సన్ జైలు ఖైదీల హక్కుల కార్యకర్తగా, సామాజికవేత్తగా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నారు. అనేకమంది హక్కుల కార్యకర్తలు, సామాజికవేత్తలపై మోడీ సర్కార్ నిఘా కార్యకలాపాలకు దిగిందని కొద్ది నెలల క్రితం 'ద వైర్' పరిశోధనాత్మక జర్నలిజం వెల్లడించింది. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో నిఘాకు గురైన ఫోన్ నెంబర్లలో రోనా విల్సన్ ఐఫోన్ కూడా ఉందని 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్స్ సెక్యూరిటీ ల్యాబ్' తెలిపింది.