Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎర్నాకుళం: ఎండైనా, వానైనా, మంచైనా ట్రాఫిక్ పోలీసులు తమ విధులను నిర్వహి స్తుంటారు. ముఖ్యం గా మండుటెండల్లో, వడగాల్పుల్లో గంటల తరబడి నిల్చొని విధులను నిర్వహించడం ట్రాఫిక్ పోలీసులకు చాలా ఇబ్బంది. వీరి కష్టాలను గమనించిన కేరళ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సదుపాయాలతో సౌర గొడుగులను అందిస్తోంది. కేవలం తలకు చల్లదనాన్ని ఇవ్వడమేకాదు.. ఈ గొడుగుల్లో ఫ్యాన్, మంచినీటి బాటిల్ పెట్టుకునే స్టాండ్, గొడుగుతోపాటు కూర్చునేందుకు సీటు, వెలుతురు కోసం లైటు ఏర్పాటుచేసే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇవన్నీ సౌరశక్తి ఆధారంగా పనిచేస్తాయి. ముందుగా కేరళ పోలీసు విభాగం కొచ్చి జిల్లా ఎర్నాకుళం నగరంలో ఇలాంటి అయిదు గొడుగులను ఏర్పాటు చేశారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే.. ఇతర జిల్లాల పోలీసులకు కూడా ఈ గొడుగులను అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.