Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలాసోర్: అణ్వా యుధ సామర్థ్యం కల్గిన 'అగ్ని ప్రైమ్' క్షిపణిని శనివారం విజయవంతంగా పరీక్షిం చారు. ఒడిశా తీరంలోని డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి పరీక్షించారు. తీరం వెంబడి ఉన్న టెలి మెట్రీ, రాడార్ స్టేషన్లు క్షిపణి ట్రాక్‌ను పర్యవేక్షించాయి. ఈ పరీక్ష సమయంలో అణు సామర్థ్యం ఉన్న అగ్ని-పి క్షిపణికి కొత్త ఫీచర్లు జోడించామని, ఈ పరీక్ష మిషన్ లక్ష్యాలన్నింటిని సాధిస్తుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అగ్ని ప్రైమ్ క్యానిస్టర్ మిస్సైల్. దీని సామర్థ్యం 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరం. అగ్ని ప్రైమ్‌కు అణ్వాయుధాలు మోసుకువెళ్లే సామర్థ్యం ఉంది. ఉదయం 11.06 నిమిషాలకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఏ) ఈ పరీక్ష చేపట్టింది.