Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు హెచ్చు తగ్గులుగా నమోదు అవుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం .. గత 24 గంటల్లో 12,11,977 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 7,081 కొత్త కేసులు వెలుగు చూశాయి. క్రితం రోజు కన్నా కాస్త తగ్గాయి. అలాగే 264 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కి చేరుకోగా.. 4,77,422 మంది కోవిడ్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 7,469 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 3,41,78,940 మంది కోవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 83,913కి తగ్గింది. క్రియా శీలక రేటు 0.24 శాతానికి దిగింది. మార్చి 2020 తర్వాత యాక్టివ్ కేసుల్లో ఇదే అత్యల్పం.. ఇక నిన్న కొత్తగా 76,54,466 మంది టీకా తీసుకున్నారు. దీంతో మొత్తం వ్యాక్సినేషన్ల సంఖ్య 1,37,46,13,252కు చేరింది. ఇక దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య శనివారం 143కి పెరిగింది.