Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కర్నాటక అసెంబ్లీలో మాజీ స్పీకర్ రమేశ్ కుమార్ చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలను ఐద్వా తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలను అసెంబ్లీలో ఎవ్వరూ విమర్శించకపోవడం శోచనీయమని, రమేష్‌కుమార్‌ను అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వరహెగ్డేకాగేరి అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం విచారకరమని పేర్కొంది.మన దేశంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని, ఎన్‌సిఆర్‌బి సమాచారం మహిళలు, బాలికలపై లైంగిక వేధింపుల పెరుగుదలను స్పష్టంగా చూపిస్తుందని ఐద్వా తెలిపింది. ఎన్నికైన సభ్యుడు మహిళలపై హింసను ఎగతాళి చేయడం తగదని విమర్శించింది. రమేశ్ కుమార్ ఇప్పటికీ క్షమాపణలు చెప్పినా, గతంలో కూడా మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన మాటలు మహిళలపై జరుగుతున్న హింసను సమర్ధించడమే కాకుండా ఈ నేరాలకు పాల్పడిన వారికి ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఐద్వా తెలిపింది.న్యాయ సూత్రాలను సమర్థిస్తానని భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసినందున, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు ఇటువంటి ఎన్నికైన సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఐద్వా డిమాండ్ చేసింది.