Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న కరోనా కొత్త వేరియంట్ యావత్ ప్రపంచాన్ని వణికిసోంది. ఈ వేరియంట్ కేసులు భారత్‌లోనూ క్రమంగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదివారం మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో వెగులుచూసిన ఈ రెండు కేసులతో కలిపి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 145కు పెరిగాయి. బ్రిటన్ నుంచి ఆదివారం గుజరాత్‌కు వచ్చిన ఓ వ్యక్తి సహా బాలుడిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టు అధికారుల వెల్లడించారు. ప్రస్తుతం వీరిద్దరూ అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో ఉన్నారని తెలిపారు. కాగా, కేంద్రం, రాష్ట్రాల గణాంకాల ప్రకారం.. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 48 కేసులు నమోదుకాగా, ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఢిల్లీలో 22, తెలంగాణ 20, రాజస్థాన్ 17, కర్నాటక 14, కేరళ 11, గుజరాత్ 9, ఆంధ్రప్రదేశ్, చంఢగీఢ్, తమిళనాడు, బెంగాల్‌లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ నిర్ధరణ అయిన 48 మందిలో 28 మంది ఇప్పటికే కోలుకున్నారని అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. భారత్‌లో మరణమృదంగం మోగించిన డెల్టా వేరియంట్ కన్నా.. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని తెలిపింది. 1.5 నుంచి 3 రోజుల వ్యవధిలోనే వ్యాప్తి ఉధృతంగా ఉందని పేర్కొంది. అయితే రోగ నిరోధకశక్తిపై ఈ వేరియంట్ ఎంతమేర ప్రభావం చూపిస్తుందన్న దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపింది. ఒమిక్రాన్‌పై ఖచ్చితమైన నిర్ణయానికి రావడానికి మరింత డేటా అందాల్సివుందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.