Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థోపెడిక్స్‌లో 18 శాతం మంది మాత్రమే పాస్
- ఈఎన్టీ పరీక్షలో 34 శాతం, పీడియాట్రిక్స్‌లో 36 శాతం మంది
- కరోనా కాలంలో బిజీ కావడమే కారణం : వైద్యులు
న్యూఢిల్లీ : ఈ సారి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) ఫలితాలు చూసి వైద్యులు ఆశ్చర్యపోతున్నారు. ఆర్థోపెడిక్స్‌లో ఫైనల్ థియరీ పరీక్షలో 18 శాతం మంది మాత్రమే ( అంటే ఐదుగురు పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లలో ఒకటి కంటే తక్కువ మంది) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ఈ ఉత్తీర్ణతా శాతం 58 శాతంగా ఉండగా, ఇప్పుడది మరీ దారుణంగా 18 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇక ఈఎన్టీ పరీక్షలో అతికష్టం మీద 34 శాతం మంది మాత్రమే పాసయ్యారు. అంటే ఈఎన్టీలో మూడింటా రెండు వంతుల మంది వైద్యులు ఫెయిల్ కావడం గమనార్హం. అదేవిధంగా, పీడియాట్రిక్స్ పరీక్షలో ఈ సారి 36 శాతం మంది, పాథాలజీలో 35 శాతం మంది వైద్యులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అయితే, ప్రసూతి, గైనకాలజీ విభాగంలో 90 శాతం మంది వైద్యులు ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, రేడియాలజీలలో ఉత్తీర్ణత 60 శాతం కంటే అధికంగా ఉన్నది. డిప్లోమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డీఎన్బీ) ఫలితాలను ఎన్బీఈ గతనెల 24న ప్రకటించింది. డీఎన్బీ అనేది మెడిసిన్ రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు. ఇద ఎండీ లేదా ఎంఎస్‌కు సమానమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కోర్సులను ప్రయివేటు మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నాయి. అయితే, దీనిని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎన్బీఈ) నిర్వహిస్తుంది. ఈ సారి కరోనా కారణంగా వైద్యులు ఆస్పత్రి పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే ఈ సారి పరీక్షల్లో తమ కష్టాన్ని గుర్తుపెట్టుకుంటారనీ భావించినప్పటికీ అలా జరగలేదని వైద్యులు వాపోయారు. పరీక్షలో చాలా క్లిష్టమైన ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. కరోనా సమయంలో వైద్యులు పరీక్షకు సరిగ్గా సిద్ధం కాలేదని ఎన్బీఈ అధికారులు తెలిపారు.