Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యర్థి అభ్యర్థులపై దాడులు, పోలింగ్ కేంద్రాల ఆక్రమణ
- అరాచకాలను ఖండించిన ప్రతిపక్షాలు
కొల్కతా : పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోమారు రెచ్చిపోయింది. ఆదివారం జరిగిన కొల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (కెఎంసి) ఎన్నికల్లో యథేశ్చగా అక్రమాలకు పాల్పడింది. 144 వార్డులకు గాను 4939 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 23 వేల మంది పోలీసులు మోహరించారు. అయితే చాలా పోలింగ్ కేంద్రాలను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆక్రమించారనీ, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులను, ఓటర్లను అడుగుపెట్టనీయకుండా బెదిరింపులకు గురి చేశారు. కొల్కతాలోని బెలెఘటలో జరిగిన నాటుబాంబు దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని ఖన్నా ప్రాంతంలోనూ బాంబులు విసిరిన ఘటనలు చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. రెండు చోట్ల బాంబులు పేలాయని, ఒకరు గాయపడ్డారని పోలీసులు కూడా నిర్ధారించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు 38 శాతం ఓటింగ్ నమోదైంది.
ప్రత్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా చేయడం, పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం వంటి అక్రమాలను తృణమూల్ కాంగ్రెస్ గతంలోనూ యథేశ్చగా సాగించింది. 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2016 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, అనంతరం 2018లో పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను పోటీలో లేకుండా చేయడం ద్వారానే అనేక స్థానాలను కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో అయితే ఏకంగా 20 వేల స్థానాల్లో తృణమూల్ అభ్యర్థులు పోటీయే లేకుండా నెగ్గడం అప్పట్లో తీవ్ర వివాదస్పదమైంది. ప్రత్యర్థులను నామినేషన్లు వేయకుండా, వేసినా పోలింగ్లో పాల్గొనీయకుండా అక్రమాలకు పాల్పడటం వల్లే ఇది సాధ్యమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
తృణమూల్ తొత్తులుగా అధికారులు
నగర పాలక ఎన్నికల్లో తృణమూల్ సాగించిన అరాచకాలను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు సుజన్ చక్రవర్తి తీవ్రంగా ఖండించారు. అధికార యంత్రాంగం తృణమూల్ కాంగ్రెస్కు తొత్తులుగా మారిపోయిందని ఆయన విమర్శించారు. అధికార పార్టీ ఈ ఎన్నికలను ఒక ప్రహాసనంగా మార్చేసిందని ఆయన వాపోయారు. ప్రతిపక్షాకలు చెందిన ఎన్నికల ఏజెంట్లకు కేటాయించిన సీట్లలోనూ వారిని కూర్చోనీయకుండా అధికారులు అడ్డుకున్నారని ఆయనత తెలిపారు. ఇది అవాంఛీనయమని పేర్కొన్నారు. తృణమూల్ దాడులను నిరసిస్తూ సిపిఎం పలుచోట్ల ఆందోళనలుతృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు తనపై దాడి చేశారని 22వ వార్డులో బిజెపి తరుపున పోటీ చేసిన మీనా దేవి పురోహిత్ ఆరోపించారు. 45వ వార్డులోని బ్రాబ్రౌన్ రోడ్డులోని ఓ పోలింగ్ కేంద్రంలోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అనుచరులపై టిఎంసి కార్యకర్తలు దాడికి పాల్పడటంతో పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.