Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా: దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలు ఊపిరి తీసుకుంటున్నారు. ప్రభుత్వం వారి కోసం అదిచేశాం.. ఇదిచేశాం అంటూ మాటలకు పరిమితం అవుతున్నాయి తప్ప.. పథకాల ప్రయోజానాలు రైతులకు అందడం లేదు. దీంతో రైతులు బలవన్మర ణాలకు పాల్పడుతు న్నారు. ఈ నేపథ్యంలోనే బెంగాలో ముగ్గురు రైతుల ఆత్మహత్య చేసుకున్నారు. జవాద్ తుఫాను కారణంగా అకాల వర్షం కురవడంతో బంగాళా దుంపలు, వరి వంటి పంటలు దెబ్బతిన్నాయనీ, ఆర్థిక భారం భయంలోనే ప్రాణాలు తీసుకున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ధాన్యాగారంగా పేరుగాంచిన పుర్బా బర్ధమాన్ జిల్లాలో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో గత రెండు రోజుల్లో ముగు ్గరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనలపై జిల్లా యంత్రాంగం విచారణ జరుపుతోంది. రైనా ఒకటవ బ్లాక్‌లోని దేబీపూర్, బంతీర్ గ్రామాల్లో శనివారం ఇద్దరు రైతులు తమ ఇండ్లల్లో ఉరివేసుకుని చనిపోయారు. అంతకు ముందురోజు శుక్రవారం కల్నా రెండో బ్లాక్‌లోని బిరుహా గ్రామంలో మరో రైతు తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణలు తీసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం బర్ధమాన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలపై విచారణ జరుపుతున్నట్టు జిల్లా మేజిస్ట్రేట్ ప్రియాంక సింగ్లా తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో అన్నదాత ఆక్రందన..
ఆరుగాలం కష్టపడి పండించిన వెల్లుల్లికి సరైన ధర లభించలేదని తీవ్ర మనస్తాపానికి గురైన రైతు.. మార్కెట్లోనే దానికి నిప్పుపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ మండిలో చోటుచేసు కుంది. వివరాల్లోకెళ్తే.. శంకర్ అనే రైతు తాను పండించిన 160 కిలోల వెల్లుల్లిని మందసౌర్‌లోని హౌల్ సేల్ మార్కెట్‌కు తీసుకొచ్చాడు. బహిరంగ వేలంలో ఆ వెల్లుల్లికి సరైన ధర లభించలేదు. రూ.5 వేలు ఖర్చు పెట్టి మార్కెట్‌కు వెల్లుల్లిని తరలిస్తే.. బహిరంగ వేలంలో దాని విలువ కేవలం రూ.1100 మాత్రమే. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు.. వెల్లుల్లిని విక్రయించకుండా నిప్పు పెట్టాడు. ఈ సీజన్లో వెల్లుల్లి సాగుకు రూ.2.5 లక్షలు ఖర్చు పెట్టాననీ, కానీ తాను పొందిన ఆదాయం మాత్రం రూ.1 లక్ష అని ఆ రైతు కన్నీరు పెట్టుకున్నారు.