Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశ్రమలకు భూమి ఐదు శాతమే
- ప్రధాన లక్ష్యాన్ని సాధించడంలో 'నోయిడా' విఫలం : కాగ్ రిపోర్ట్
న్యూఢిల్లీ : యూపీలోని యోగి పాలనలో పారిశ్రా మికీకరణ ఆశించినంత స్థాయిలో ముందుకు పోవడం లేదు. యూపీ ఇండిస్టియల్ ఏరియా డెవలప్మెంట్ యాక్ట్, 1976 కింద ఏర్పాటైన న్యూ ఓఖ్లా ఇండిస్టియల్ డెవలప్మెంట్ అథారిటీ (నోయిడా) రాష్ట్రంలో పారిశ్రామీకీకరణను ముందుకు తీసుకెళ్లే విషయంలో విఫలం కావడమే దీనికి నిదర్శనంగా ఉన్నది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. యూపీ రాష్ట్ర అసెంబ్లీలో కాగ్ నివేదికను ఇటీవల ప్రవేశపెట్టారు. నోయిడా అథారిటీ సేకరించిన మొత్తం భూమిలో ఐదుశాతం మాత్రమే పారిశ్రామికీకరణ కోసం అభివృద్ధి చేయగలిగిందిని నివేదిక పేర్కొన్నది. '' ఇండిస్టియల్ ఏరియాను అభివృద్ధి చేయడం నోయిడా ప్రధాన లక్ష్యం. అయితే, పరిశ్రమల వినియోగం కోసం 18.36 శాతం భూమిని మాత్రమే నోయిడా అభివృద్ధి చేసింది. కానీ, ఫంక్షనల్ ఇండిస్టియల్ ఏరియా మాత్రం ఐదు శాతంగానే ఉన్నది. నోయిడా.. తన ప్రధాన ఉద్దేశమైన పారిశ్రామికీకరణలో విఫలమైంది'' అని నివేదిక పేర్కొన్నది. కాగ్ నివేదికను తాము అధ్యయనం చేయాల్సి ఉన్నదని ఈ అంశంపై నోయిడా సీఈఓ రితూ మహేశ్వరీ స్పందించారు. యోగి పాలనలో యూపీ అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్న అధికార బీజేపీకి కాగ్ రిపోర్ట్ ఇప్పుడు ఎదురుదెబ్బేనని రాజ కీయ విశ్లేషకులు వివరించారు. వచ్చే ఏడాదిలో షెడ్యూల్ ప్రకారం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. దీంతో కాగ్ రిపోర్ట్ ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారుతుందని విశ్లేషకులు తెలిపారు.