Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోన్లో మాట్లాడిన రష్యా అధ్యక్షుడు
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఈ నెల 6న జరిగిన కార్యక్రమంలో ఇరువురు నేతలు కలిసిన పక్షం రోజులకే మళ్లీ ఈ ఫోన్ సంభాషణ చోటు చేసుకుంది. ఎరువుల సరఫరాతో సహా అన్నిరంగాల్లో భారత్, రష్యా సహకారాన్ని మరింత పెంపొందించే దిశగా ముందుకు సాగాలని నిర్ణయించామని ప్రధాని కార్యాలయం ట్విట్టర్లో వెల్లడించింది. ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు.