Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణ ఖాతాల ముందస్తు రద్దుపై చార్జీలు
- ఆయా విత్త సంస్థలపై చర్యలు తీసుకోవాలి : ఆర్థిక మంత్రికి ఎంఎస్ఎంఈ బాడీ వినతి
న్యూఢిల్లీ : ప్రయివేటు బ్యాంక్‌లకు వ్యతిరేకంగా చిన్న పరిశ్రమల యాజమాన్యాలు పిడికిలి బిగిస్తున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలను ముందస్తుగా పూర్తిగా చెల్లించడానికి ముందుకు వస్తే ఆయా సంస్థలపై ప్రయివేటు బ్యాంక్‌లు అదనపు ఛార్జీలు వేస్తున్నాయి. దీంతో చిన్న రుణ గ్రహీతలు తీవ్ర ఆందోళనకు గురైతున్నారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఐఎస్ఎంఈ) ప్రెసిడెంట్ అనిమేష్ సక్సేనా తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. ముందస్తుగా రుణ ఖాతాలను రద్దు చేసుకునే ఎంఎస్ఎంఇలపై వేస్తున్న ఛార్జీలకు వ్యతిరేకంగా విదివిధానాలను ప్రకటించాలని అనిమేష్ కోరారు.కొన్ని ప్రయివేటు బ్యాంక్‌లు ఓవర్డ్రాప్టులు,నగదు రుణాలపై ఛార్జీలను వేస్తున్నాయన్నారు.''ఆర్బీఐ విదివిధానాల పరిమి తులను దాటి ప్రయివేటు రంగ బ్యాంక్‌లు చేపడు తున్న తప్పుడు విధానాలపై చర్యలు తీసుకో వాలి.ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బ్యాంక్‌లపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు పద్దతుల కు పాల్పడే బ్యాంక్‌లపై జరిమానాలు విధించాలి'' అని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేశాయి. ఎంఎస్ఎంఇ బ్యాంకింగ్ విధానాలకు భిన్నంగా పలు ప్రయివేటు బ్యాంక్‌లు ముందస్తు రుణ ఖాతాల ముగింపునపై 2నుంచి 4శాతం వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఆ పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ ఒక్కరు తెలిపారు.పరపతి కలిగిన వ్యాపార సంస్థలకు ఓవర్‌డ్రాప్ట్ సదుపాయం ఉంటుంది.దీని ఆధారంగా కరెంట్ ఖాతాలో తగు నిల్వ లేనప్పుడూ కూడా చెక్‌లు జారీ చేస్తే సాధారంగా పాస్ చేయాలని ఎఫ్ఐఎస్ఎంఇ కోరింది. నగదు రుణం (సీసీ) పరిమితి, ముందస్తు రుణ చెల్లింపునపై ఆర్బీఐ విదివిధానాలను బ్యాంక్‌లు అనుసరించాలని ఎంఎస్ఎంఈ పరిశ్రమ వర్గాలు కోరాయి.