Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భీమా కొరేగావ్ అల్లర్లు కేసులో లొంగిపోవడానికి జనవరి 7కు వరవరరావుకు బాంబే హైకోర్టు సమయం ఇచ్చింది. వరవరరావు పిటీషన్ను సోమవారం జస్టిస్ నితిన్ జందర్, జస్టిస్ ఎస్వి కొత్వాల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. జనవరి 7 వరకూ ఆయనకు ఉపశమనం ఇచ్చింది. ఈ కేసులో ఎన్ఐఎ చేత అరెస్టు కాబడ్డ 82 ఏండ్ల వరవరరావు ప్రస్తుతం మెడికల్ బెయిల్పై విడుదలైన ముంబయిలో తన భార్యతో కలిసిఉంటున్నారు. తెలంగాణలోని తన ఇంటికి వెళ్లడానికి కోర్టు అనుమతించాలని పిటిషన్లో కోరారు. అయితే వరవరరావు సాధారణంగానే ఉన్నారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న కోర్టు డిసెంబరు 28లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వరవరరావు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేస్తూ, జనవరి 7 వరకు లొంగిపోయేందుకు రావుకు వ్యవధి ఇచ్చింది.