Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు గంటల పాటు ప్రశ్నలు..
ముంబయ్ : పనామా పేపర్లకు సంబంధించి విదేశీ ఉల్లంఘనల ఆరోపణలపై ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం విచారించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో ఉన్న ఒక కంపెనీలో డబ్బులు దాచారనే ఆరోపణలపై సోమవారం సుమారు ఐదు గంటల పాటు విచారణ జరిగిన తరువాత రాత్రి ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. సోమవారం ఉదయం ముందుగా ఈడీ ఇచ్చిన సమన్లు మేరకు ఐశ్వర్యరారు ఈ విచారణకు హజరయ్యారు. గతంలో ఇంతకు ముందు రెండు సార్లు ఇడి ఆమెకు సమన్లు జారీ చేసింది. అప్పుడు ఆమె మరింత వ్యవధి కోరారు. 2017 నుంచి ఈడీ ఈ కేసును విచారణ చేస్తోంది. 2004 నుంచి బచ్చన్ కుటుంబం చేసిన విదేశీ పెట్టుబడులపై సమాచారం ఇవ్వాలని ఈడీ తన సమన్లలో కోరింది. ఆరోపణల ప్రకారం 2004లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో స్థాపించబడిన అమిక్ పార్ట్నర్స్ అనే కంపెనీకి డైరెక్టర్‌గా ఐశ్వర్య ఉన్నారు. న్యాయ సంస్థ మొసాక్ ఫోన్సెకా ఈ కంపెనీని రిజిస్టర్ చేసింది. దీని మూలధనం 50,000 అమెరకన్ డాలర్లు. అయితే 2009లో ఈ కంపెనీ నుంచి బయటకు వచ్చినట్టు ఐశ్వర్య రారు చెబుతున్నారు.