Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలసరి ఆదాయంలో దేశంలో 32వ స్థానం
న్యూఢిల్లీ : మరికొన్ని నెలల్లోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుత యోగి ప్రభుత్వ పాలనలో యుపి ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. 2019-20లో ఉత్తరప్రదేశ్ తలసరి ఆదాయం భారత దేశ సగటు రూ.86,659లో సగం మాత్రమే అంటే రూ.41,023. తలసరి ఆదాయం విషయంలో దేశంలో మొత్తం రాష్ట్రాలు (36)లో ఉత్తరప్రదేశ్ 32వ స్థానంలో ఉందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే యోగి ప్రభుత్వం మాత్రం గత నాలుగేళ్లలో రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందంటూ పత్రికల్లో మొదటి పేజీ ప్రకటనలు ఇస్తూ అబద్ధపు ప్రచారం సాగిస్తోంది.అలాగే అధికారిక అంచనాల ప్రకారం యూపీలో యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) 2017-21 వ్యవధిలో సంవత్సరానికి కేవలం 1.95 శాతం వృద్ధి రేటు మాత్రమే కనబర్చింది. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ హయాంలో (2012-17) వృద్ధి రేటు 6.92 శాతంగా ఉండటం విశేషం. యోగి ప్రభుత్వ హయాంలో వృద్ధి రేటు పడిపోవడం వల్ల యుపిలో తలసరి ఆదాయం గత నాలుగేండ్లలో సగటున 0.43 శాతం మాత్రమే పెరిగింది. తయారీ రంగం కూడా యోగి ప్రభుత్వ కాలంలో కేవలం 3.34 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతకు ముందు ప్రభుత్వం హాయాంలో ఇది 14.64 శాతంగా ఉండటం గమనార్హం.ఇక ఉపాధి రంగంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైయింది. 2012తో పోలిస్తే ప్రస్తుతం మొత్తం నిరుద్యోగం 2.5 రెట్లు పెరిగింది. యువతలో నిరుద్యోగం దాదాపు 5 రెట్లు పెరిగింది. సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారిలో నిరుద్యోగం మూడు రెట్లు పెరిగింది. హైయిర్ సెకండరీ పాఠశాల విద్య పూర్తి చేసిన వారిలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగింది. ఇక గ్రాడ్యుయేట్లల్లో నిరుద్యోగం 21 శాతం నుంచి 51 శాతానికి పెరిగింది. టెక్నికల్ డిప్లొమాలు/సర్టిఫికెట్లు పూర్తి చేసిన వారిలో నిరుద్యోగం 13 నుంచి 66 శాతానికి పెరిగింది. టెక్నికల్ గ్రాడ్యుయేట్లల్లో నిరుద్యోగం 19 నుంచి 46 శాతానికి పెరిగింది.