Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకిస్థాన్ బోటు నుంచి 77 కేజీల హెరాయిన్ స్వాధీనం
- దాని విలువ సుమారు రూ. 400 కోట్లు
- ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఏటీఎస్ ఆపరేషన్.. అదుపులో ఆరుగురు
అహ్మదాబాద్ : గుజరాత్ సముద్ర తీరంలో మళ్లీ డ్రగ్స్ పట్టుబడింది. గత నెలలో మోర్బీ జిల్లాలో హెరాయిన్ పట్టుబడిన విషయం మరవక ముందే తాజా ఘటన చోటుచేసుకున్నది. భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ఫిషింగ్ బోటు నుంచి భద్రతా దళాలు 77కిలోగ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి.దాని విలువ సుమారు రూ. 400కోట్లు ఉంటుందని అంచనా.ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ- టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) లు కలిసి ఈ ఆపరేషన్ ను చేపట్టాయి. అల్-హుసేనీ బోటు సిబ్బంది ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం అధికారులు బోటును గుజరాత్ కుచ్ జిల్లా జఖావ్కు తరలించారు. గుజరాత్ తీర ప్రాంతాలు, పోర్టుల్లో డ్రగ్స్ పట్టుబడిన పలు సందర్భాలు ఇటీవల చోటు చేసుకున్నాయి. మూడు నెలల క్రితమే ముంద్రా పోర్టు నుంచి రూ.21వేల కోట్ల విలువ చేసే సుమారు మూడువేల కిలో గ్రాముల హెరాయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) సీజ్ చేసింది. అలాగే, జఖావ్ తీరంలో భారత జలాల్లోకి ప్రవేశించిన బోటులో పాకిస్థానీల నుంచి రూ.150 కోట్ల విలువగల 30కిలోగ్రాముల హెరాయిన్‌ను కోస్ట్ గార్డ్ సిబ్బంది ఈ ఏడాది ఏప్రిల్‌లో స్వాధీనం చేసుకున్న ది.అలాగే,మోర్బీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి నుంచి దాదాపు రూ.600కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను ఏటీఎస్ నవంబర్‌లో పట్టుకున్నది.