Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడుగా మంత్రి తనయుడు
న్యూఢిల్లీ : శస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) 58వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన పరేడ్‌కు ముఖ్య అతిథిగా రావాల్సిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పేరును చిట్టచివరి నిముషంలో మార్చారు. మిశ్రా స్థానంలో ఆయన సహచర మంత్రి నిశిత్ ప్రామాణిక్ పేరును చేర్చారు. అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా, నలుగురు రైతుల హత్యకు కారణమైన అక్టోబరు 3 నాటి లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడుగా వున్నాడు. చనిపోయిన రైతుల్లో ఒకరి కుమారుడు నచ్చతార్ సింగ్ ఎస్ఎస్బీలో వున్నారు. పైగా ఖేరీ ఘటనపై ఏర్పాటైన సిట్ నివేదిక గురించి గత వారం యూపీలో ఒక విలేకరి ప్రశ్నించగా అజరు మిశ్రా ఆ విలేకరిని దూషిస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అజరు మిశ్రా ముఖ్య అతిథిగా వుండబోరని ఒక అధికారి ధ్రువీకరించారు. అయితే, ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ప్రతి ఏటా సాగే పరేడ్‌కు ఈసారి మీడియాను అనుమతించలేదు.