Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటింగ్‌కు ప్రతిపక్షాలు కోరినప్పటికీ అనుమతి నిరాకరణ
- సభనుంచి ప్రతిపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ : ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేస్తూ ఉద్దేశించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుపై ఓటింగ్‌కు ప్రతిపక్షాలు కోరినప్పటికీ అనుమతి నిరాకరించబడింది. దీంతో ప్రతిపక్షాలు సభను వాకౌట్ చేశారు. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును ప్రభుత్వం ఆమోదించుకున్నది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ఎనిమిది నిమిషాలకే మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు చైర్మెన్ ఎం.వెంకయ్య నాయుడు ప్రకటించారు. తిరిగి ప్రారంభమైన సభలో డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికల చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. అందుకు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.బీఏసీలో చర్చించకుండా, తగినంత సమయం ఇవ్వకుండా బిల్లును ఎలా తీసుకొస్తారనీ,ఇది అప్రజాస్వామ్యం అని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ, టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ విమర్శించారు. అయినప్పటికీ వాటిని పట్టించుకో కుండా డిప్యూటీ చైర్మెన్ అనుమతితో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజును బిల్లును ప్రవేశపెట్టా రు. దీంతో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు పట్టుకొని నినాదాలు ఇస్తూ ఆందోళన చేపట్టారు.బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని సీపీఐ(ఎం) ఎంపీలు జాన్ బ్రిట్టాస్, వి.శివదాసన్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివతో పాటు మరికొంతమ ంది ప్రతిపక్ష ఎంపీలు సవరణలు ప్రతిపాదించారు. అయితే డిప్యూటీ చైర్మెన్ సవరణలను తిరస్కరించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం ఇచ్చారు. బిల్లుపై సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఓటింగ్‌కు డిమాండ్ చేశారు. ''తాను ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ జరగాలి. సభ సంరక్షకునిగా సభను ఆర్డర్లో పెట్టాల్సిన బాధ్యత మీదే.కానీ సభ ఆర్డర్లో లేదని చెబుతున్నా రు''అని జాన్ బ్రిట్టాస్ పేర్కొన్నారు. అయితే డిప్యూటీ చైర్మన్ దాన్ని పట్టించుకోకుండా డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ ప్రతిపాదించిన సవరణలపై మాట్లాడబోతుండగా,వెంటనే ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక సభ్యుడు ఓటింగ్‌కు కోరినప్పుడు దాన్ని అనుమ తించాలని ఖర్గే పేర్కొన్నారు. దీంతో డిప్యూటీ చైర్మెన్ సభ ఆర్డర్లో లేదనీ, సభ్యులంతా వెల్ నుంచి తమ స్థానాలకు వెళ్లటం లేదని అన్నారు. ఈ బిల్లుపై ఓటింగ్‌కు కోరాలని ఉద్దేశం మీకు (ప్రతిపక్షం) లేదని పేర్కొన్నారు. ఓటింగ్‌కు అనుమతించకపో వడంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. తరువాత బిల్లును ముజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సభను ప్యానల్ స్పీకర్ సస్మిత్ పాత్ర నేటీ (బుధవారం) కి వాయిదా వేశారు.