Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ : మహిళల వివాహ వయస్సు 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచుతూ తీసుకొచ్చిన బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లును లోక్‌సభలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రవేశపెట్టారు. అయితే హడావుడిగా బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిం చాయి. బిల్లును స్టాండింగ్ కమిటీ, లేదా సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. దీంతో బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపుతున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. లోక్‌సభను ప్రారంభిస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు మంగళవారం ప్రయత్నించారు. ప్రతిపక్ష సభ్యులు వివిధ అంశాలనులేవనెత్తారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు చేబూని పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించిన స్పీకర్, సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదావే శారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించారు. కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ లఖింపూర్‌ఖేరీ లో రైతుల హత్యపై సిట్ తన నివేదికలో ఘటన ఉద్దేశపూర్వంగానే జరిగినట్టు స్పష్టం చేసిందనీ, కేంద్ర మంత్రి తనయుడు అందులో జోక్యం ఉందని తెలిపారు. కేంద్ర మంత్రికీ ప్రమేయం ఉందనీ, ఆయనను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. డీఎంకే నేత టిఆర్ బాలు మాట్లాడుతూ నీట్ రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన బిల్లును రాష్ట్ర గవర్నర్‌కు పంపామనీ, ఆయన దాన్ని మూడు, నాలుగు నెలలుగా ఉంచుకు న్నారని తెలిపారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమనీ, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, దాన్ని గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించాలని కోరారు. టీఎంసీ సభ్యుడు సౌగత్ రారు మాట్లాడుతూ లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రమేయమున్న కేంద్ర మంత్రిని తొలగించాలనీ, దీనిపై సభలో చర్చించాలని డిమాం డ్ చేశారు. అనంతరం కేంద్ర మహిళా, శిశు అభి వృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఎవరి తోనూ చర్చించకుండా, రాష్ట్రాలను సంప్రదించ కుండా బిల్లును ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. బిల్లును సప్లమెంటరీ బిజినెస్ లిస్టులో పెట్టి, హడా వుడిగా తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తొందరపడితే తప్పులు జరుగుతా యనీ, తాము ప్రభుత్వానికి సలహా ఇవ్వాలనుకుం టున్నామని అన్నారు. ఈ విషయంపై దేశంలో విస్తృత చర్చ జరుగుతున్నదనీ, విస్తృత పరిశీలన కోసం బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోరు మాట్లాడుతూ ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాననీ, లా కమిషన్ రిపోర్టులో మహిళ వివాహ వయస్సు 18 ఏండ్లు నిర్ణయించిందని తెలిపారు. టీఎంసీ ఎంపీ సౌగతారారు మాట్లాడుతూ ప్రభుత్వం హడావుడిగా బిల్లును తీసుకొచ్చిన విధానాన్ని వ్యతిరేకిస్తున్నాననీ, ఈ బిల్లును అన్ని భాగస్వామ్యపక్షాలతో పూర్తిగా చర్చ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఐయూఎంఎల్ ఎంపీ మహ్మద్ బషీర్ మాట్లాడుతూ ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమనీ, అనవసరమైనదని అన్నారు. అలాగే ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు.ఆర్ఎస్పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ మాట్లాడుతూ గ్రామీణులు,నిరుద్యోగ యువత పెళ్లి కోసం 21 ఏండ్ల వరకు వేచిచూడాలా అని ప్రశ్నించారు.18ఏండ్ల వయస్సు రాజ్యాంగం ఆమోదం పొందిందనీ, సిటిజన్‌షిప్ ఇతర అన్ని అంశాల్లో కూడా 18ఏండ్లనే పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.18ఏండ్లకే మహిళలు ఓటు హక్కును పొందుతున్నారనీ, అలాంటప్పుడు 21 ఏండ్లకు పెంచటం ఎందుకని ప్రశ్నించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో స్వేచ్ఛ హక్కుకు వ్యతిరేకమని అన్నారు. సోమాలియా కంటే భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం తక్కువగా ఉందని అన్నారు. బేటీ బచావో.. బేటీ పడావోకు సంబంధించిన 80 శాతం నిధులను మోడీ ప్రచారానికి ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఈబిల్లు 18 ఏళ్ల మహిళలకు వ్యతిరేకమనీ, కనుక దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శివసేన ఎంపీ వినాయక్ రౌత్ మాట్లాడుతూ సప్లమెంటరీ బిజినెస్‌లో పెట్టి బిల్లును తీసుకురావల్సిన అవసరం ఏమొచ్చిందనీ, బిల్లుపై సమగ్ర చర్చ అవసరమని అన్నారు.ఈ బిల్లును తదుపరి పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులే మాట్లా డుతూ..ఈ బిల్లు పరిశీలనకు పంపాలన్నారు. మహిళలకు అనుగుణంగా, వారి సాధికారిత కోసం ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారో చూసి ఏకగ్రీవంగా ఆమోదిద్దామని అన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ మహిళా రిజర్వే షన్ బిల్లు తప్ప, ఏ బిల్లుపైనా సంప్రదించడంపై ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ఈ బిల్లును సివిల్ సోసైటీ అభిప్రాయాలు తెలసుకోవడానికీ, సమీక్ష కోసం స్టాండింగ్ కమిటీ, లేదా సెలెక్ట్ కమిటీకి పంపటం చాలా ముఖ్యమని తెలిపారు. బీజేడీ ఎంపి అనుభవ్ మహంతి మాట్లాడుతూ ఈ బిల్లుపై సమగ్ర చర్చ జరగా లనీ, అందుకోసం బిల్లును స్టాండింగ్ కమిటీ, లేదా సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో వివాహబంధంలోకి ప్రవేశించడానికి స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించడంలో 75ఏండ్లు ఆలస్యం చేశామనీ, ఈ సవరణ ద్వారా మొదటిసారిగా పురుషులు, మహిళలు 21ఏండ్ల వయస్సులో సమానత్వ హక్కును దృష్టిలో ఉంచుకొని వివాహంపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు.అయితే బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపుతున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ అండ్ కంపెనీ సెక్రటరీల (సవరణ) బిల్లుని మరింత సమీక్ష కోసం స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేశారు.