Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తమిళనాడులోని కుడాంకుళం అణు విద్యుత్ ప్లాంట్ (కెకెఎన్‌పీపీ) ఆరో యూనిట్ నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. రియాక్టర్ భవనం పునాది శ్లాబ్‌లో మొదటగా కాంక్రీట్‌ను పోయడం ద్వారా నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించినట్లు రొసాటమ్ ప్రభుత్వ కార్పొరేషన్ తెలిపింది.''జూన్‌లో ఐదవ నెంబరు విద్యుత్ యూనిట్లో మొదటగా కాంక్రీట్‌ను పోశారు.డిసెంబరు 20న ఆరో యూనిట్లో కాంక్రీట్‌ను వేసినట్లు జెఎస్సి ఆటమ్స్టోరీ ఎక్స్పోర్ట్(ఎఎస్ఇ)ఉపాధ్యక్షుడు ఆండ్రీ లెబెదెవ్ తెలిపారు.తమిళనాడు ప్రాంతంలో, మొత్తంగా దేశంలో పారిశ్రామి క, వాణిజ్యాభివృద్ధి కార్యకలాపాలకు హామీ కల్పించేలా కెకెఎన్‌పిపి మూడవ దశ అదనపు విద్యుత్ సామర్ధ్యం అందిస్తుందని ఆయన తెలిపారు. మొదటి రెండు విద్యుత్ యూనిట్లు సాధారణ స్థాయిలో నిలకడగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని చెప్పారు.రెండో దశలో విద్యుత్ యూనిట్లు నిర్మితమ వుతున్నాయని,రియాక్టర్ ప్రెజర్ వెసల్‌ను ఏర్పాటు చేసేందుకు మూడో యూనిట్ సన్నద్ధమవుతోందన్నారు.భారత్,రష్యా అణు సహకారంలో భాగం గా,కుడాంకుళంలో లైట్ వాటర్ రియాక్టర్లను,ఆరు వివిఇఆర్-1000 యూనిట్లను రొసాటమ్ నిర్మించాల్సి వుంది.12యూనిట్లు భారత్‌లో నిర్మించ ేందుకు 2014డిసెంబరులో ఉభయ పక్షాలు అంగీకరించాయి. జెఎస్సి ఎఎస్ఇ రష్యా వైపు నుండి డిజైనర్,పరికరాల సరఫరాదారుగా వున్నారు.