Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పార్టీ కీలక నేత మజితియాపై ఎఫ్ఐఆర్
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం
చండీగఢ్ : పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ప్రతిపక్ష శిరోమణి అకాళీ దళ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. డ్రగ్స్ కేసులో ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ బిక్రమ్ సింగ్ మజితియాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద పంజాబ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆయనపై కేసు నమోదు చేసింది. శిరోమణి అకాళీ దళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు బావమరిది అయిన మజితియా ఆ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. దీంతో డ్రగ్స్ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈయనకు పంజాబ్‌లో డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలున్నాయని కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే, మజితియాతో పాటు శిరోమణి అకాళీ దళ్ ఈ ఆరోపణలను కొట్టిపారేశాయి.కాగా,మజితియాపై చర్యను ఆహ్వా నిస్తూ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు.