Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్జీటీకి తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
న్యూఢిల్లీ : డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణంపై ముందుకెళ్లమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కి తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తగిన పర్యావరణ అనుమతులు లేకుండా డిండి ఎత్తిపోతల పథకం చేపడుతున్న నేపథ్యంలో పనులునిలిపి వేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతోకూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, న్యాయవాది దొంతిరెడ్డి మాధురిరెడ్డిలు వాదనలు వినిపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ ఇప్పటికే స్టే విధించడం అందులో అంతర్భాగమైనందున డిండి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టమని తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీకి తెలిపింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై తదుపరి విచారణ జనవరి 6న చేపడతామని ధర్మాసనం పేర్కొంది.