Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన పార్లమెంట్ సమావేశాలు
- లోక్సభ 82శాతం, రాజ్యసభ 48శాతం కార్యకలాపాలు
- ఐదు బిల్లులు స్టాండింగ్ కమిటీకి, ఒక బిల్లు జాయింట్ కమిటీకి
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై ప్రభు త్వం మొండిగా ఉండటంతో సభా కార్యకాలాపాల నిర్వహణ నిలిచిపోయింది. మరోవైపు రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం దుమారం రేపింది. కాగా, లోక్సభలో 82శాతం, రాజ్యసభ 48 శాతం కార్యకలాపాలు జరిగాయి. బుధవారం ప్రారం భమైన ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్య సభలో చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటిం చారు. అలాగే సభ నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు అర్జున్ రామ్మేఘ్వాల్, వి.మురళీధరన్లతో కలిసి మాట్లాడారు. నవంబర్ 29న ప్రారంభమైన పార్ల మెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 నాటికి ముగియాల్సి ఉందని, కానీ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే పార్లమెంట్ సమావేశాలు ముగిశాయని తెలిపారు. ఈ సమావేశాలు 24 రోజుల పాటు 18 సిట్టింగ్స్ జరిగాయని తెలిపారు. లోక్సభలో 12 బిల్లులు, రాజ్యసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఉభయ సభల్లో 11 బిల్లులను ఆమోదించినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 2021-22 ఏడాదికి సంబంధించిన గ్రాంట్ల సప్లమెంటరీ డిమాండ్లకు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిందనీ, రాజ్యసభలో కాలేదని, అయితే ఆర్టికల్ 109(5) ప్రకారం 14రోజులు దాటిని తరువాత పార్లమెంట్ ఆమోదం పొం దినట్లేనని అన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) ఆర్డినెన్స్, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) ఆర్డినెన్స్, నార్కోటిక్ డ్రగ్స్ మరి యు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (సవరణ) ఆర్డినెన్స్ పార్లమెంట్ సమావేశాలకు ముందే రాష్ట్రపతి ఆమోద ముద్రతో తెచ్చామనీ, ఆ మూడు ఆర్డినెన్స్ స్థానంలో మూడు బిల్లులను ఉభయ సభల్లో ఆమోదం పొందాయని తెలిపారు. బయోలాజికల్ డైవర్సిటీ (సవరణ) బిల్లును జాయింట్ కమిటీకి పంపామని, ఐదు బిల్లులను స్టాండింగ్ కమిటీకి పంపామని అన్నారు. లోక్సభలో 193 రూల్ కింద కోవిడ్, వాతావరణ మార్పులపై స్వల్పకాలిక చర్చ జరిగిందనీ, రాజ్యసభలో కరోనాపై చర్చ జరిగిందని తెలిపారు.
ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లులు
- వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు
- ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు
- ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లు
- సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు
- హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (జీతాలు, సేవా నిబంధనలు) సవరణ బిల్లు
- డ్యామ్ సేఫ్టీ బిల్లు
- సహాయ పునరుత్పత్తి సాంకేతికత (నియంత్రణ) బిల్లు
- సరోగసీ (నియంత్రణ) బిల్లు
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (సవరణ) బిల్లు
- అప్రోప్రియేషన్ (నెం.5) బిల్లు
- నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (సవరణ) బిల్లు