Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారణాసి : ఆవు మనకు తల్లి, పవిత్రమైనదని, దేశంలో కోట్లాది మంది ప్రజలు జీవనోపాధి కోసం పశువులపై ఆధారపడి ఉన్నారని దీనిని 'పాపం' అని భావించేవారు గ్రహించలేరని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో గురువారం రూ. 2,905 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఒక ర్యాలీలో మోడీ ప్రసంగించారు. దేశంలో కోట్లాది మంది గోవులు, గేదలపై ఆధారపడి జీవిస్తారనే విషయం మర్చిపోయి కొంతమంది వీటిపై జోకులు వేస్తుంటారని మోడీ పేర్కొన్నారు. 'ఆవు మనకు తల్లి, పవిత్రమైనది' అని మోడీ చెప్పారు. దీనిని కొంత మంది పాపంగా భావిస్తారని కూడా తెలిపారు. గురువారం ఉదయం వారణాసికి ప్రధాని మోడీ చేరుకున్నారు. కర్కియాన్లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇండిస్టీయల్ డెవలెప్మెంట్ అధారిటీ ఫుడ్ పార్క్‌లో 'బనస్ డైరీ సంకుల్'కు శంకుస్థాపన చేశారు. 30 ఎకరాల్లో రూ 475 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో రోజుకు 5 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేయనున్నట్లు అధికారులు చెప్పారు.కాగా, 10 రోజుల వ్యవధిలో వారణాసిలో మోడీ పర్యటించడం ఇది రెండోసారి. ఈ నెల 13న కాశి విశ్వనాథ్ కారిడార్‌ను మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో 2022 ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.