Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి
లూధియానా : పంజాబ్‌లోని లూధియానా నగరంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో సంభవించిన పేలుడులో ఇద్దరు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. కోర్టు కాంప్లెక్ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న బాత్రూమ్లో మధ్యాహ్నం 12:22 గంటలకు జరిగిన ఈ పేలుడుతో బాత్రూమ్ గోడలు పూర్తిగా దెబ్బతినగా, సమీప గదుల్లో అద్దాలు దెబ్బతిన్నాయి. భవనంలో ఒక సెక్షన్ బిల్డింగ్ రెండుగా చీలిపోయింది. పేలుడు జరిగిన సమయంలో జిల్లా కోర్టు పూర్తి రద్దీగా ఉంది. పేలుడు విషయం తెలిసినవెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయకార్యక్రమాలు ప్రారంభించారు. భవనంలోని ప్రజల్ని తీసుకునిరావడంతో పాటు, క్షతగ్రాతుల్ని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి సమీపంలోనే కోర్టు భవనంలోనే పేలుడు జరగడం సంచలనంగా మారింది.