Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ రాజకీయ ఎజెండాను మార్చేసిన రైతు ఉద్యమం : తపన్ సేన్
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) ఛత్తీస్గఢ్ రాష్ట్ర కార్యదర్శిగా సంజయ్ పరాటే తిరిగి ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఏడో మహాసభలో కోర్బాలో మంగళ, బుధవారాల్లో జరిగింది. ఈ మహాసభకు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు తపన్ సేన్, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు జోగేంద్ర శర్మ హాజరయ్యారు. తొలుత పార్టీ సీనియర్ నేత గజేంద్ర ఝా జెండా ఎగురవేసి, అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. స్వాగతోపన్యాసం చేస్తూ విఎం మనోహర్ కోర్బాలో భూ నిర్వాసితుల పోరాటాలను ప్రస్తావించి, కార్మిక, కర్షక ఐక్యతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి సంజయ్ పరాటే రాజకీయ, సంస్థాగత నివేదికను మహాసభకు సమర్పించారు. ప్రస్తుత రాజకీయ సవాళ్లను ప్రస్తావిస్తూ తన నివేదికలో ప్రజా సంఘాల ఏర్పాటు, కార్యకర్తలకు సైద్ధాంతిక శిక్షణపై ఉద్ఘాటించారు. తద్వారా పార్టీ రాజకీయ పునాదిని విస్తరించవచ్చు పేర్కొన్నారు. సీపీఐ(ఎం) ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ 23 మందితో ఏకగ్రీవంగా ఎన్నికయింది. రాష్ట్ర కార్యదర్శిగా సంజరు పరాటే తిరిగి ఎన్నికయ్యారు. ఛత్తీస్గఢ్లో సీపీఐ(ఎం), వామపక్షాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సంస్థాగత విస్తరణ, ప్రజల పోరాటాన్ని ఉధృతం చేయాలనే స్పష్టమైన పిలుపుతో మహాసభ ముగిసింది.
యుద్ధంలా రైతు ఉద్యమ్ణం తపన్ సేన్
మహాసభను ప్రారంభిస్తూ సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు తపన్ సేన్ మాట్లాడారు. రైతు ఉద్యమం దేశ రాజకీయ ఎజెండానే మార్చేసిందనీ, కార్పొరేట్ దోపిడీని అరికట్టవచ్చని ఈ ఉద్యమం చాటిచెప్పిందన్నారు. అయితే దీని కోసం కార్మిక, కర్షక ఐక్యతను బలోపేతం చేయడం ద్వారానే వర్గ పోరాటం ఉధృతమ వుతుందని స్పష్టం చేశారు. సమాజంలో మౌలిక మార్పులకు పోరాటమే ఆయుధమనీ, గతంలో కూడా భూ సేకరణ చట్ట సవరణపై జరిగిన పోరాటంలో విజయం సాధించామని తెలిపారు. ఇప్పుడు ఈ పోరాటాన్ని రాజకీయంగా తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ నియంత్రణలో ఉన్న బీజేపీ ఓటమిని ప్రతి చోటా ఖాయం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పాలక వర్గం ఒంటరి అయినప్పుడు, సామాన్య ప్రజలను ఐక్యం కాకుండా విభజించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం అదే ఆటను బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మతరాజకీయం ఆడుతున్నాయని విమర్శించారు. కాబట్టి మతవాదం, హిందుత్వ దాడికి వ్యతిరేకంగా అట్టడుగు స్థాయిలో, సైద్ధాంతిక స్థాయిలో పోరాడాలని పిలుపు ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో వామపక్ష ఉద్యమం బలహీనమైన శక్తిగా ఉన్నప్పటికీ, రాజకీయాల్లోని ప్రతి రంగంలో జోక్యం చేసుకోవడం,సాధారణ ప్రజల ప్రతిఘటనను నిర్వహించడం ద్వారా సామాజిక మార్పు కోసం పోరాటాన్ని ఉధృతం చేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజానుకూల విధానాలు, పోరాటాల వల్ల రానున్న రోజుల్లో సీపీఐ(ఎం) ప్రభావవంతమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జోగేంద్ర శర్మ ముగింపు రోజున ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కోసం ప్రజల సమస్యలపై పోరాటా లను మరింత వేగిరపర్చాలని ఉద్ఘాటించారు. ''సంఘం ఎంత బలంగా ఉంటే, ప్రజా పోరాటాల విస్తరణ అంత వేగంగా జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో సీపీఐ(ఎం), వామపక్షా లను బలోపేతం చేసేందుకు ఇదే కీలకం. సీపీఐ(ఎం)ను రాజకీయ పటంలో ఉంచే మార్గం ఇదే'' అని పేర్కొన్నారు.