Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిస్టమస్ వేడుకలు నిలిపివేయాలంటూ బెదిరింపులు
బెంగళూరు : క్రిస్టమస్ వేడుకలు నిలిపివేయాలంటూ పాఠశాల యాజమాన్యంపై కాషాయ మూకలుదాడికి యత్నించిన ఘటన కర్నాటకలో జరిగింది. మాండ్య జిల్లాలోని నిర్మలా ఇంగ్లీష్ హైస్కూల్, అండ్ కాలేజీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 'తల్లిదండ్రులారా.. ఈ నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాం.. ఈ వ్యవహారాన్ని మా చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది'అని వారు బెదిరిస్తు దశ్యాలూ ఆ వీడియోలో రికార్డయ్యాయి. వివాదాస్పద మతమార్పిడి నిరోధక బిల్లును కర్నాటక అసెంబ్లీ బుధవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. బిల్లు ఆమోదం పొందిన కొన్ని గంటల్లోనే కాషాయమూకలు విరుచుకపడిన ఘటన ఇది రెండవది కావడం గమనార్హం.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కనికా ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది పాఠశాలలో క్రిస్టమస్ వేడుకలు జరుపుతామని.. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఆంక్షలు విధించడంతో వేడుకలను నిర్వహించడంలేదని అన్నారు. అయితే విద్యార్థులే స్వచ్ఛందంగా తమ డబ్బులతో వేడుకల కోసం కేక్‌ను ఆర్డర్ చేశారని చెప్పారు. దీనిపై ఒక విద్యార్థి తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారని అన్నారు. హిందూత్వ కార్యకర్తలకు ఫిర్యాదు చేశారని అన్నారు. దీంతో పాఠశాలలోకి దౌర్జన్యంగా ప్రవేశించిన కాషాయమూకలు.. పాఠశాల యాజమాన్యాన్ని బెదింరించడంతో పాటు దాడికి యత్నించారని అన్నారు. క్రిస్టియానిటీ గురించి బోధిస్తూ.. మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నారని విరుచుకుపడ్డారని అన్నారు. పాఠశాలలో మతమార్పిడులకు పాల్పడితే సహించేది లేదంటూ హెచ్చరించారని అన్నారు. పాఠశాలలో సరస్వతీ దేవి ఫొటోను పెట్టడంతో పాటు హిందువుల పండగలు జరిపించాలని బెదిరించారని అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఇటీవల చర్చిలతో పాటు క్రైస్తవ సంస్థలపై పదేపదే దాడులకు పాల్పడుతున్న కాషాయ మూకల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని పలువురు హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.