Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా : ఢాకా నుంచి బరుంగా వెళ్తున్న మూడంతస్తుల ఫెర్రీ నౌకలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన ఢాకాకు 200 కిలోమీటర్ల దూరంలోని ఝలాకటి జిల్లాలోని ఓ నదిలో జరిగింది. మంటలు ఒక్కసారిగా వ్యాపించటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నికీలలు ఒక్కసారిగా ఎగిసి పడుతుండడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు నదిలోకి దూకారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీ నౌకలో 500 మంది వరకూ ప్రయాణికులు ఉన్నారని లోకల్ పోలీసు చీఫ్ మెయినల్ ఇస్లాం తెలిపారు. మంటల్లో చిక్కుకుని కొంతమంది మృతిచెందగా.. మరికొందరు నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పేరిగే అవకాశం ఉందన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఇంజన్లో మంటలు సంభవించడమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు.