Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ, హరిద్వార్ సభల్లో మత విద్వేష ప్రసంగాలు
- చంపడానికి సిద్ధం : సాధ్వి అన్నపూర్ణ
- ముస్లింలపై దాడులకు తెగబడండి : యతి నరసింహానంద
- చంపటమో.. చావటమో..: 'సుదర్శన్' న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్
- ఆయుధాలతో హత్యాకాండకు హిందూత్వ సంస్థలు పిలుపు
న్యూఢిల్లీ : బీజేపీ, దానికి అండగానిలబడుతున్న హిందూ త్వ సంస్థలు దేశంలో మత విద్వేషానికి తెరలేపుతున్నాయి. ముస్లింలపై యుద్ధానికిసిద్ధం కావాలంటూ మెజార్టీ హిందూ ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి. ఆయుధాలుచేపట్టి మయన్మార్ లో రోహింగ్యా ముస్లింలను తరిమికొట్టినట్టు భారత్‌లో ము స్లింలపై దాడులకు తెగబడాలని హిందూత్వసంస్థల ప్రతి నిధులు పిలుపునిస్తున్నారు. కొద్దిరోజుల క్రితంన్యూఢిల్లీ, హరి ద్వార్‌లో హిందూత్వ సంస్థలు నిర్వహించిన సభలకు బీజేపీ నాయకులు హాజరయ్యారు. బీజేపీ నాయ కులు మతవిద్వే షాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలుచేశారు. ముస్లిం లను లక్ష్యంగా చేసుకొని ఆయుధాలతో దాడులు జరపాలని పిలపునిచ్చారు. ఈవ్యవహారంపై సర్వత్రాఆగ్రహం వ్యక్తం అవుతోంది. కేంద్రంలో మోడీ సర్కార్ అండదండలతోనే హిందూత్వ సంస్థలు రెచ్చిపోతున్నాయని, మత విద్వేషాలకు మద్దతు పలుకుతోందని సీపీఐ(ఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆయుధాలు చేపట్టండి..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కనుసన్నల ల్లో నడిచే 'హిందూ యువవాహినీ' సభ ఈనెల 19న ఢిల్లీలో జరిగింది. సభకు దేశవ్యాప్తంగాఉన్న హిందూత్వ ప్రతినిధు లు హాజరయ్యారు. 'సుదర్శన్' న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ సురేశ్ చావాంకే ప్రసంగిస్తూ ముస్లింపై విషంకక్కాడు. భారత్‌ను హిందూత్వ దేశంగా ఏర్పాటుచేయటం కోసం చంపటమో చావటమో చేయాలంటూ విద్వేషాన్ని రగిలిం చాడు. ''భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు మన చివరి శ్వాస వరకూ పోరాడాలి. చంపటమో చావటమో.. దేనికైనా సిద్ధం కావాలి'' అంటూ హిందూ యువ వాహినీ కార్యకర్తలతో ప్రమాణం చేయించారు. సురేశ్ చావాంకే వీడియో ప్రసంగం ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో ప్రసారమైంది. ఈ సభకు యూపీ మంత్రి రాజేశ్వర్ సింగ్ హాజరయ్యారని వీడియోలో కనపడింది.
హిందువుల జనాభా తగ్గిపోతోంది..
హరిద్వార్‌లో నిర్వహించిన 'ధర్మసంసద్'లో వక్తలు మత విద్వేషాన్ని వెళ్లగక్కారు. ఈనెల 17 నుంచి 19 వరకూ మూడు రోజులపాటు జరిగిన ఈ సభల్లో పలు హిందూత్వ సంస్థల ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందువులంతా ఆయుధాలు చేపట్టి, ముస్లింలపై యుద్ధానికి సిద్ధంకావాలని సభపిలుపునిచ్చింది. సభకు నేతృత్వం వహించిన యతి నరసింహానంద మాట్లా డుతూ.. ''ముస్లింలను ఆర్థికంగా బహిష్కరిస్తే సరిపోదు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని హిందూ సమాజం ఆయు ధాలతో యుద్ధానికి దిగాల్సిందే. దేశంలో ముస్లిం జనాభా పెరుగుతుండగా, హిందువుల సంఖ్య క్రమంగా తగ్గిపో తోంది. మరో ఏడెనిమిదేండ్లలో రోడ్లపై ముస్లింలు మాత్రమే కనిపించే స్థాయిలో మార్పులు వస్తాయి''అని చెప్పారు. హిందూ మహాసభ ఆఫీస్ బేరర్ అన్నపూర్ణ అత్యంత తీవ్ర మైన మత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. జైలుపాలైనా సరే.. చంపడానికి సిద్ధం కావాలి.. అని అన్నారు. మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే అడుగుజాడల్లో వెళ్లి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చంపాలనుకున్నానని ధరమ్‌దాస్ చెప్పారు. హిందువులంతా రూ.లక్ష విలువైన ఆయుధాలు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని రూర్కీ కి చెందిన సాగర్ సింధూరాజ్ మహరాజ్ సూచించారు. ''మయన్మార్‌లో పోలీస్, ఆర్మీ ఏం చేసిందో భారత్‌లో ప్రతి హిందువూ తెలుసుకోవాలి. దానిని అనుసరించాలి. మొత్తం ముస్లింలను తుదముట్టించాలి. రోహింగ్యాలను తరిమికొట్టినట్టు తరిమికొట్టాలి. మనకు వేరే ఆప్షన్ లేదు'' అని స్వామి ప్రబోధానంద్ (హిందూ రక్షసేన) అన్నారు.
కఠిన చర్య తీసుకోవాలి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
ముస్లింలను లక్ష్యంగా చేసుకొని హిందూత్వ సంస్థల ప్రతినిధులు చేసిన మత విద్వేష ప్రసంగాలను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. హరిద్వార్‌లో జరిగిన 'ధర్మ సన్సాద్' కార్యక్రమంలో వక్తలు భారత రాజ్యాంగాన్ని తీవ్రంగా ఉల్లంఘించారు. ''ఇవి కేవలం విద్వేష ప్రసంగాలు మాత్రమే కాదు, హింసకు పాల్పడాలంటూ మెజార్టీ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను చంపాలంటూ ఉగ్రవాద చర్యలకు వక్తలు ఉసిగొల్పారు. కేంద్రంలో మోడీ సర్కార్, ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మద్దతుతోనే హిందూత్వ సంస్థలు రెచ్చిపోతున్నాయి. మన పాలకులకు ఇది సిగ్గుచేటు. విద్వేషపూరిత వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారమవు తున్నా కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు'' అని పొలిట్‌బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాలు చేసినవార్ని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.