Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు : సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్నది. మహాసభ జరిగే తాడేపల్లిలోని పాత టోల్గేట్ సమీపంలోని సీఎస్ఆర్ కల్యాణ మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జెండా ఆవిష్కరణలు, ప్రజానాట్యమండలి కళాకారులు తమ నత్యరూపకాల ద్వారా మహాసభ విశిష్టతను తెలియజేస్తూ వాడవాడలా ప్రచారం చేస్తున్నారు. సోమవారం ఉదయం పది గంటలకు మహాసభ ప్రారంభం కానుంది. ప్రారంభ సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్, బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మహాసభకు రాష్ట్రం మొత్తమ్మీద 480 మంది ప్రతినిధులు, పరిశీలకులు హాజరు కానున్నారు. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే ప్రతినిధులు, పరిశీలకులు జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్డు వద్ద పాత టోల్గేట్ స్టాప్ వద్ద దిగి సిఎస్ఆర్ కల్యాణ మండపానికి చేరుకోవాలని ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పాశం రామారావు కోరారు. 150 మంది వలంటీర్లు ఏర్పాట్లలో పాల్గంటున్నారు.
జిల్లాల నుంచే ప్రతినిధులకు వసతి...
వివిధ జిల్లాల నుంచి మహాసభకు వచ్చే పార్టీ ప్రతినిధులకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు విజయవాడ, తాడేపల్లి ప్రాంతాల్లో వసతి ఏర్పాటు చేశారు. విజయవాడ గవర్నర్‌పేటలోని ఎంబి భవన్‌లోని 3, 4 అంతస్తుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ రూరల్, విశాఖ అర్బన్, కాకినాడ, రాజమండ్రి, పశ్చిమగోదావరి డెల్టా, పశ్చిమగోదావరి అప్ల్యాండ్ జిల్లాలకు చెందిన వారికి వసతి కల్పిస్తున్నారు. వీరితో పాటు రాష్ట్ర కేంద్రానికి చెందిన బాధ్యులకు కూడా ఇక్కడే వసతి ఉంటుంది. ఎంబి భవన్‌కు ఇన్ఛార్జిగా ప్రవీణ్ (ఫోన్ : 9394082402) వ్యవహరిస్తారు. వడ్డేశ్వరంలోని పుచ్చలపల్లి సుందరయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రకాశం తూర్పు, ప్రకాశం పశ్చిమ, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం ఉత్తరం, అనంతపురం దక్షిణం తదితర జిల్లాల ప్రతినిధులకు వసతి కల్పిస్తారు.
ఈ కేంద్రానికి ఇన్ఛార్జిగా బైరగాని శ్రీనివాసరావు (ఫోన్ : 8309750269) ఉంటారు. విజయవాడ రాణిగారితోటలోని సిఐటియు కార్యాలయంలో కష్ణా తూర్పు, కష్ణా పశ్చిమ జిల్లాల ప్రతినిధులకు వసతి ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు ఇన్ఛార్జిగా ఎం.శ్రీనివాస్ (ఫోన్ : 9494888830) ఉంటారు. విజయవాడ బాలోత్సవ్ భవన్లో 71 మంది మహిళా ప్రతినిధులకు వసతి ఏర్పాటు చేశారు.