Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తేనీటి విందు ఇచ్చారు. శనివారం సాయంత్రం ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సీజేఐకి సీఎం సతీసమేతంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర ప్రముఖులు, మరత్రులను సీఎం సీజేఐకి పరిచయం చేశారు. అంతకుముందు జస్టిస్ వెంకటరమణ ఓ హౌటల్లో ఏర్పాటు చేసిన క్రిస్ట్మస్ వేడుకల్లో పాల్గని కేక్ కట్ చేశారు. పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం రోటరీ క్లబ్ విజయవాడ ఆధ్వర్యాన సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ప్రభుత్వ తేనీటి విందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతోపాటు, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. వారికి ప్రభుత్వం తరుపున మర్యాదపూర్వక ఆహ్వానం పలికారు. అనంతరం చీఫ్ జస్టిస్, సీఎం ఇద్దరూ కలిసి క్రిస్ట్మస్ కేకును కట్‌చేశారు.