Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
విశాఖ : బీజేపీ తన అనుబంధ సంఘాల ద్వారా దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు విమర్శించారు. మతోన్మాద బీజేపీని తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 317వ రోజుకు చేరాయి.శనివారం దీక్షల్లో ఉక్కు కర్మాగారం ఎస్ఎంఎస్-1 ఉద్యోగులు కూర్చున్నారు.ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు ఎన్.రామారావు మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రుల సమక్షంలోనే హిందూ రక్షసేన ప్రతినిధి ప్రబోధానందగిరి 'భారత రాజ్యాంగం తప్పు, గాంధీని చంపిన గాడ్సేని హిందువులందరూ పూజించాలి'అనడం,గాడ్సే మార్గంలో నడిచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని చంపాలనుకున్నానని మరో హిందుత్వవాది ధరమ్ దాస్ చెప్పడం వారి మతోన్మాదానికి పరాకాష్ట అన్నారు. అటువంటి వారిపై కేసులు పెట్టకుండా, అది వారి స్వేచ్ఛ అని కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను, దేశ సంపదను, వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలను అనుసరిస్తూ, ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ఎన్నికల్లో గెలవాలని బిజెపి చూస్త్తోందని విమర్శించారు.