Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల పనితీరుపై నాలుగో ఎడిషన్ ర్యాంకులను విడుదల చేయనున్న నిటిఆయోగ్
న్యూఢిల్లీ : 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ''ది హెల్తీ స్టేట్స్, ప్రోగ్రెసివ్ ఇండియా'' పేరుతో రాష్ట్రాల ఆరోగ్య పరమైన పనితీరుపై రేపు (డిసెంబర్ 27) నిటి ఆయోగ్ నాలుగో ఎడిషన్ నివేదిక ర్యాంకులను విడుదల చేయనున్నది. కో-ఆపరేటివ్, కాంపిటీటివ్ ఫెడరలిజంలో భాగంగా ఆరోగ్య రంగంలో మెరుగుదల దిశగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను నిటి ఆయోగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిరంతరం ప్రోత్సహించడానికి పని చేస్తాయని నిటిఆయోగ్ తెలిపింది.
2017లో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (నిటి ఆయోగ్), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రపంచ బ్యాంక్ సహకారంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్య రంగం పనితీరు, అలాగే ఆరోగ్య రంగం పెంపొందించేందుకు వార్షిక ఆరోగ్య సూచికను ప్రారంభించింది. వార్షిక ఆరోగ్య సూచిక లక్ష్యం ఆరోగ్య ఫలితాలు, ఆరోగ్య వ్యవస్థల పనితీరుపై పురోగతిని నిర్ణయిస్తాయి. ఆరోగ్యకరమైన పోటీని అభివృద్ధి చేయడం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య క్రాస్-లెర్నింగ్‌ను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆరోగ్య సూచిక స్కోర్ బట్టీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ర్యాంకింగ్‌లు పురోగతి అంచనా వేయడానికి రూపొందిస్తుంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్, ఇతర ఆరోగ్య ప్రోత్సాహకాలతో సహా ఆరోగ్య సంబంధిత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేసే ప్రయత్నాలకు ఇది సహాయపడుతుందని నిటి ఆయోగ్ పేర్కొంది. 24 సూచికలతో కూడిన వెయిటెడ్ కాంపోజిట్ స్కోర్‌ను బట్టీ హెల్త్ ఇండెక్స్‌లో ఆరోగ్య పనితీరు స్పష్టం అవుతుందని తెలిపింది.