Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్ : సిక్కు గురువులు ఆనాడు హెచ్చరించిన ప్రమాదాలు నేటికీ ఇంకా కొనసాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. తీవ్రవాదం, మత ఛాందసవాదంపై ఎలా పోరాడాలో గురు తేజ్ బహదూర్ తన సాహసోపేత చర్యల ద్వారా దేశానికి నేర్పారని అన్నారు. గుజరాత్లోని కచ్ జిల్లాలో లఖ్పత్ గురుద్వారాలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని ఆన్లైన్లో హాజరయ్యారు.ఆనాడు మన గురువులు వేటి గురించైతే హెచ్చరించారో ఈనాటికీ అవే ముప్పులు అదే రూపంలో కొనసాగుతున్నాయ ని అన్నారు.అందువల్ల మనం అప్రమత్తంగా వుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వుందని అన్నారు. గురుపురాబ్ ఉత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురు నానక్ దేవ్జీ జన్మించే నాటికి విదేశీ శక్తులు భారత విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. అటువంటి పరిస్థితుల్లో నానక్, అటు తర్వాత వచ్చిన గురువులందరూ తమ బోధనలతో చైతన్యాన్ని తీసుకువ చ్చారని, భారత్ సురక్షితంగా వుండేందుకు మార్గాన్ని రూపొందించారని పేర్కొన్నారు.సామాజికసంస్కరణలు, ఆథ్యాత్మికతకు మాత్రమే వారు పరిమితం కాలేదని,దేశానికి నాయకత్వం అందించారని అన్నారు.