Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ సమయంలో గంగానదితోపాటు దాని ఉపనదుల్లో 300కుపైగా సగం కాలిన శవాలు , కుళ్లిన మృతదేహాలు కొట్టుకొచ్చాయని.. పవిత్రమైన గంగానది డంపింగ్ యార్డుగా మారిందని 'క్లీన్ గంగ' జాతీయ పథకం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ఆయన రాసిన 'గంగ' పుస్తకాన్ని ప్రధాని ఆర్థిక కౌన్సిల్ సలహాదారులు బిబేక్ దెబ్రారు ఇటీవల ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రంజన్ మిశ్రా మాట్లాడుతూ .. ''కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశంలో సరిపడా బెడ్లు లేక, ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా చనిపో యిన వారి సంఖ్య ఎక్కువైంది. ఉత్తర్‌ప్రదేశ్ , బీహార్ రాష్ట్రాల్లో వైరస్‌తో చనిపోయిన వారిని ఏమి చేయాలో తెలియని జిల్లా పాలనా యంత్రాంగం .. శవాలను సులభంగా డంపింగ్ చేసేందుకు గంగానదిని ఎంచుకుంది. కరోనా మృతదేహాలను ఖననం చేయడంపై అవగాహన లేక కొందరు , అంత్య క్రియలకు డబ్బుల్లేక మరికొందరు వారి మృతదేహాలను గంగానదిలో పడేశారు.'' అని తెలిపారు. అంత్యక్రియల నిర్వహణ సరిగా లేకపోవడం, మృతదేహాలను దహనం చేయకుండా పడేయడం గురించి తెలియజేసేందుకే ఈ పుస్తకాన్ని రాసినట్లు ఆయన తెలిపారు.