Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 నుంచి బూస్టర్ డోసులు:ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశంలో ఒమైక్రాన్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఒమైక్రాన్ వ్యాప్తి చెందుతోందని మోడీ అన్నారు. ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, రాష్ట ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, జాగ్రత్తగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. ''దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 18 లక్షల బెడ్లు ఉన్నాయి. చిన్నారుల కోసం 90వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. దేశంలో మందులకు ఎలాంటి కొరత లేదు. ఆస్పత్రుల్లో 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉంచా. ఒమైక్రాన్ నివారణకు టీకాలు, జాగ్రత్తలే మంది. దేశంలో గత జనవరి 26 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. దేశంలో అర్హులైన 61శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి. అనేక దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్లో మన దేశం ముందుంది.''జనవరి 3 నుంచి 15-18 ఏండ్ల లోపు వారికి వ్యాక్సినేషన్, 60ఏండ్లు పైబడినవారికి, ఫ్రంట్ లైన్, హెల్త్‌కేర్ వర్కర్లకు జనవరి 10 నుంచి బూస్టర్ డోసులు ఇస్తాం. త్వరలో అందుబాటులోకి డీఎన్ఏ వ్యాక్సిన్. త్వరలో అందుబాటులోకి పిల్లల కొవిడ్ టీకా. భారత్ బయోటెక్ కొవిడ్ టీకాకు డీసీజీఐ అనుమతి.'' అని మోడీ తెలిపారు.