Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రార్థనలు అడ్డుకుంటూ కాషాయ మూకల నినాదాలు
- క్రిస్మస్ ముందురోజు గుర్గావ్లో ఘటన
గుర్గావ్ : ఇక్కడి పటౌడీలోని చర్చిలో క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం సాయంత్రం క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహిస్తుండగా, కాషాయ మూకలు చొరబడి అంతరాయం కలిగించాయి. 'జై శ్రీరామ్', 'జై భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. పాటలు పాడుతున్న వారిని పక్కకు తోసేసి మైకు లాక్కున్నారని బాధితులు తెలిపారు. స్థానిక పాస్టర్ పీటీఐతో మాట్లాడుతూ 'చర్చిలో మహిళలు, పిల్లలు ఉన్నందున భయంగా ఉంది. రోజురోజుకూ ఈ బెడద పెరుగుతోంది. ప్రార్థన మత పరమైన మా హక్కు. ఈ దాడి మా హక్కులను అడ్డుకోవడమే' అని తెలిపారు. పటౌడి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అమిత్కుమార్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఇప్పటికే గుర్గావ్లో ముస్లింలు నమాజ్ చేసుకుంటుండగా, తరచూ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.