Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టు ఆదేశాలు పాటించని ఉన్నతాధికారులపై మద్రాసు హైకోర్టు
చెన్నై : న్యాయస్థానం ఆదేశాలు పాటించని ఐఏఎస్ అధికారులపై మద్రాసు హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాంటి అధికారుల ఐఏఎస్ కేడర్‌ను తొలగించాలని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ వైద్యనాథన్, జస్టిస్ ఆర్ విజరుకుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు స్పందించింది. ఆదేశాలను పాటించని పక్షంలో జరిమానా ద్వితీయమనీ,జైలు శిక్ష ప్రాథమికంగా ఉంటుందని పలుసార్లు స్పష్టం చేస్తున్నట్టు కోర్టు వివరించింది. తమిళనాడు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ యాక్ట్ కింద దాఖలవుతున్న దరఖాస్తులు, అప్పీళ్లపై నిర్ణయం తీసుకోవడంలో అధికారులు జాప్యం చేస్తుండటంపై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. చెన్నైకి చెందిన ఒక వ్యాపారి దాఖలు చేసిన పిటిష న్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.