Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్-19 కారణంగా మరణించిన వారి కుటుంబాలకు చెల్లించిన నష్టపరిహారం వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కమిటీ మైనార్టీ విభాగం చైర్మెన్ సమీర్ వలీవుల్లా ఒక ప్రకటన విడుదల చేశారు. వైరస్ బారిన పడి 4,021మంది మరణించినట్టు సర్కారు ప్రకటిస్తున్న దానికంటే చాలా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.కేంద్రం రూ.50వేల పరిహారం ప్రకటించిన తర్వాత కూడా తప్పులను సరిదిద్దుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్ని ంచలేదని విమర్శించారు. ఆస్పత్రుల్లో మరణించిన వాటినే అధికారులు పరిగణనలోకి తీసుకుంటూ అడ్మిషన్ నిరాకరణకు గురై, ఆస్పత్రుల బయట,ఇంటి వద్ద చనిపోయిన వారిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.డెత్ సర్టిఫికేట్లలో కోవిడ్ కారణంగా పేర్కొనకుండా 'పల్మనరీ అరెస్ట్' లేదా 'పల్మనరీ కార్డియాక్ అరెస్ట్' అని ఉంటుండటంతో బాధిత కుటుంబాలకు పరిహారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అలాంటి మరణాలన్నింటిని కోవిడ్ మరణాలుగా గుర్తించేందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.