Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్‌లో ఆరుగురిమృతి
ముజఫర్‌పూర్ : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో నూడుల్స్ తయారీ కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను శ్రీకృష్ణా మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ జయంత్ కాంత్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉన్నది. ఈ ఫ్యాక్టరీ ముజఫర్ పూర్లోని బేలా ఇండిస్టియల్ ప్రాంతంలో ఉంది. ప్రమాదం జరిగే సమయంలో ఆ ఫ్యాక్టరీలో ఎంత మంది పనిచేస్తున్నారన్న సమాచారం తెలియరాలేదు. ఉదయం 10 గంటల సమయలో ఈ ఫ్యాక్టరీలోని బాయిలర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ శబ్దం ఐదు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల నిర్మాణాలు కుప్పకూలాయి.