Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజ్‌వాదీ పార్టీవి పగటి కలలు : అమిత్ షా
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలవేళ బీజేపీ హిందూత్వను, అయోధ్య రామ మందిర నిర్మా ణాన్ని మరోసారి ఆయుధంగా వాడుకుంటున్నది. యూపీలో ఓ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హౌం మంత్రి, ఆ పార్టీ అగ్రనాయకుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలే దీనికి అద్దం పడుతున్నాయి. రామ మందిర నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరనీ, అధికారంలోకి తిరిగి వస్తే నిర్మాణాన్ని ఆపాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పగటి కలలు కంటోందని అమిత్ షా అన్నారు. యూపీలోని జలౌన్‌లో 'జన్ విశ్వాస్ యాత్ర'లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్పీపై ప్రధానంగా ఆరోపణలు చేశారు. '' అఖిలేశ్ నేతృత్వంలోని పార్టీ (ఎస్పీ) అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపివేస్తున్నామని చెప్తున్నది. అది మాత్రం జరగని పని'' అని షా అన్నారు. '' అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు. రాష్ట్రంలోని సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లు కులతత్వ పార్టీలు'' అని చెప్పారు. కరసేవలపై కాల్పులు జరిపినవారు రామ మందిర నిర్మాణం విషయంలో సంతోషంగా లేరని పరోక్షంగా ఎస్పీని ఉద్దేశిస్తూ అమిత్ షా అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.