Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరప్రదేశ్లో పడిపోతున్న గ్రాఫ్
- ప్రజలను నేరుగా ప్రభావితం చేస్తున్న అనేక అంశాలు
లక్నో: ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగీల డబుల్ ఇంజిన్ పాలన ఢమాల్ అంటున్నది. వీరు తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ప్రత్యక్షంగానే ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో పాటు ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయని తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాల పాలన అభివృద్ధిని వివరించే క్రమంలో 'డబుల్ ఇంజిన్' పదాలను వాడటం కమళం నేతలు అధికం చేశారు. ఇందులో ఒక ఇంజిన్ కేంద్రంలోని ప్రధాని మోడీ సర్కారు కాగ, రెండో ఇంజిన్ బీజేపీ పాలిత రాష్ట్ర సర్కారు. ఈ విషయంలో యూపీకి సంబంధించిన ఆర్థిక వృద్ధి, పారిశ్రామికీకరణ, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ, వేతనాలు, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు వంటి ప్రజలను నేరుగా ప్రభావిత ం చేసే కీలక సమస్యలపై డబుల్ ఇంజిన్ పనితీరును గమనిస్తే క్రమంగా క్షీణిస్తున్నదని అధికారిక గణాంకాలు (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) పేర్కొంటున్నాయి.
ఆర్థికవృద్ధి మందగమనం
2017 మార్చిలో బీజేపీ విజయంతో యోగి ఆదిత్యనాథ్ యూసీ సీఎంగా ఎన్నికైనప్పుడు.. 2016-17 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఆరోగ్యకరమైన 11.4 శాతం వృద్ధితో ముగిసింది. అయితే, అప్పటి నుంచి ఇది క్రమంగా క్షీణిస్తూ.. 2020-21లో ఏకంగా -6.4 శాతానికి పడిపోయింది. అంతకు ముందు ఏడాది (2019-20)లో ఇది 3.8 శాతానికి తగ్గిపోయింది. 2018-19లో 6.3 శాతంగా, 2017లో 4.6 శాతంగా నమోదైంది. మోడీ-యోగీల డబుల్ ఇంజిన్ ఎక్కడో గాడి తప్పిందని స్పష్టం తెలుస్తోంది. ఆర్థిక వృద్ధి విషయంలో మోడీ సర్కారు ప్రదర్శించిన చొరవ కార్పొరేట్ రంగ పెట్టుబడులపై ఆధారపడటం, యూపీలో యోగి ఇన్వెస్టర్స్ సమ్మిట్లను నిర్వహించడం, వివిధ సేవలను ప్రయివేటీకరించడం వంటి చర్యల ద్వారా ఫలితం కనిపించలేదు. అయినా ఆయా ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోకుండా, ఇదే తరహా వాగ్దానాలు చేస్తూ.. మళ్లీ అధికా రంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.
డీఇండిస్టియలైజేషన్
తడబడుతున్న యూపీ ఆర్థిక వ్యవస్థలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రస్తావించని మరో విషయం పరిశ్రమ ఆర్థిక సహకారం రాష్ట్రానికి తగ్గిపోవడం. 2016-17, 2020-21 మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమల వాటా తగ్గిపోయింది. ఇది 35 శాతం నుంచి 31 శాతానికి తగ్గిపోయింది. అంటే దేశీ, విదేశీ భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పెద్దగా రాలేదు. దీనికి తోడు సంప్రదాయ, ఇతర పరిశ్రమలను ప్రోత్సహించే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమంపైనా దృష్టి సారించలేదు. పరిశ్రమ రంగంలో ఉపాధి కూడా పేరగలేదు. ఎక్కువ మంది తక్కువ వేతనాలు అందిస్తున్న అనధికార రంగం, వ్యవసాయంలో ఉపాధిని పొందుతున్నారు.
పెరిగాన రాష్ట్ర రుణభారం
డబుల్ ఇంజిన్ పాలనలో యూపీ రుణ భారం కూడా భారీగా పెరిగింది. 2016-17లో రాష్ట్ర రుణ భారం రూ.4,73,348 కోట్లుగా ఉండగా, 2020-21లో దాదాపు 40 శాతం పెరిగి రూ.6,62,891కు పెరిగింది. దీంతో అత్యధిక రుణం ఉన్న రాష్ట్రంగా యూపీ నిలిచింది. ఈ రుణంలో దాదాపు నాలుగింట మూడు వంతులు వాణిజ్యపరమైనది. రాష్ట్ర ప్రజల ఒక్కొక్కరిపై భారీగానే ఈ రుణభారం ఉందని తెలుస్తోంది.
ప్రజల నెత్తిన ధరాఘాతం !
రాష్ట్ర ఆర్థిక విధానాల్లో మరో ముఖ్యమైన అంశాల్లో మార్కెట్లో నిత్యవసర ధరలు ఒకటి.యూపీలో యోగి పాలన మొదలైనప్పటి నుంచి డబుల్ ఇంజిన్ పాలన వేగాని కి సగటు వార్షిక ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగింది. 2.4 శాతం నుంచి 2020-21లో 6.1 శాతానికి పెరిగింది. కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉపాధి పోవడానికి తోడు ద్రవ్యోల్బణం పెరుగుతుదల కుటుంబాలను ఆర్ధిక కూపంలో పడేసింది. దీనికి కారణంగా విద్యా, వైద్య, ఆహారం సహా అనేక ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
పడిపోయిన గ్రామీణ వేతనాలు
గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం (2021) యూపీలో పురుష కార్మికుల సగటు రోజువారి వేతనం రూ.274.5గా ఉంది. అధికారికంగా ప్రకటించిన రేట్లు దీనికి కంటే తక్కువగా ఉండగం గమనార్హం. ఇది భారత దేశ సగటు (రూ.309.9) కంటే తక్కువగా ఉంది. దేశంలో అత్యల్ప వేతనాలు అందిస్తున్న రాష్ట్రాల యూపీ కంటే ఐదు రాష్ట్రాల్లోనే తక్కువగా ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా యూపీలో 1.99 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారని 2011 జనాభా లెక్కలు పేర్కొంటున్నాయి. మోడీ-యోగీల డబుల్ ఇంజిన్ పాలన వైఫల్యం చెందిందని పై గణాంకాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. డబుల్ ఇంజిన్ నినాదంతో పెద్దగా ప్రయోజనం లేకపోయిందని అర్థమవుతోంది. మొత్తంగా డబుల్ ఇంజిన్ పాలన ప్రయివేటీకరణ, కార్పొరేట్లకు రాయితీలు, సంక్షేమ వ్యయాల ఉపసంహరణ, మయోపిక్ ఆర్థిక విధానాలు అనుసరిస్తున్నాయి. దీని కారణంగానే మోడీ-యోగీల డబుల్ ఇంజిన్ పాలన వైఫల్యం చెందిందని నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతు న్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ దారుణ ఆర్థిక దుస్థితికి కారణమైన ఈ తప్పుడు దార్శనికతను ప్రజలు గమనిస్తు న్నారనేది నాయకులు గుర్తెరగాలని పేర్కొంటున్నారు.