Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్వేష ప్రచారం, హింసను రెచ్చగొట్టడాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకోవాలి
న్యూఢిల్లీ: పవిత్ర నగరం హరిద్వార్‌లో ఇటీవల హిందూ మత పెద్దలు మరియు రాజకీయ కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కాషాయ నేతలు చేసిన ప్రసంగాలు మన దేశానికి, రాజ్యాంగానికి మతపరమైన విలువలకు చాలా అవమానం కలిగించే విధంగా ఉన్నాయి. రెచ్చగొట్టే ప్రసంగాల ట్రాక్ రికార్డ్ ఉన్న ముఖ్య వ్యక్తులు ఈ ధర్మ సంసద్ అని పిలవబడే మతపరమైన పార్లమెంటులో ముస్లింలపై మారణహౌమం జరపాలని, అందుకు హిందువులను ఆయుధాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
అంతేకాదు వీరి ప్రసంగాలలో ఇటువంటి అభ్యంతరకరమైన ఎన్నో మార్గాలను కూడా సూచించారు. వాటిలో కొన్ని భాగాలు వీడియో ఫుటేజ్ రూపంలో బయటకు వచ్చాయి. ఇది మైనారిటీల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి, వారిని సాయుధ హింసకు గురిచేసేందుకు ప్రజలను ప్రేరేపించేదిగా ఉంది. హిందూత్వ సంస్థలు గత కొంత కాలంగా దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టటానికి ప్రయత్నిస్తున్నాయి. 2014 తర్వాత మరింత దుందుడుకు తనాన్ని ప్రదర్శిస్తున్నాయి. విభజన మరియు మతతత్వ ధోరణులను కీర్తించి అపోథియోసిస్ మారణహౌమం సృష్టించడానికే సమ్మేళనం అని చెప్పడానికి ఇటీవలి జాతీయ చరిత్ర గురించి లోతైన జ్ఞానం అవసరం లేదు.
మయన్మార్ తరహా ప్రక్షాళన ప్రచారం, కాన్ఫరెన్స్ ఫలితాలను అధికారిక విధానంగా ప్రకటించకపోతే రాష్ట్రంపై '1857 కంటే భయంకరమైన' తిరుగుబాటు ముప్పు ఉంటుందని, అవకాశం దొరికితే తాను మరో 'గాడ్సే'గా మారి ఒక మాజీ ప్రధానిని పార్లమెంట్లో కాల్చిచంపి ఉండేవాడినని ఆ సమావేశంలో ఒక వక్త ప్రసంగించటం చూస్తే రాబోయే రోజుల్లో
చట్టబద్ధపాలనకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరగబోయే వ్యవస్థీకత దాడిని సూచిస్తున్నాయి. అయితే, అన్నివైపుల నుంచి ఎదురైన ఆగ్రహావేశాలు, విమర్శల తర్వాత ఒక్క వ్యక్తిగత ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరాఖండ్ అధికారుల నిస్సహాయ ప్రతిస్పందన ఈ విధంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.
భారతదేశంలో హిందువులు మరియు హిందూ మతం యొక్క భవిష్యత్తు గురించి భయాన్ని వ్యాపింప చేయటం మితవాద రాజకీయాల లక్షణం. ఈ మత పెద్దల సమ్మేళనం అటువంటి క్రూరమైన ఆలోచనలకు ఆజ్యం పోస్తోంది. ఈ ద్వేషపూరిత ఉపన్యాసాల వెనుక ఎంతో మర్మం ఉంది. అధికారిక ప్రోత్సాహం కోసం ఈ శక్తులు నిరీక్షిస్తున్నాయనేదానికి ఇది ఒక సూచిక . ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు, ముఖ్యంగా ప్రధానమంత్రి మరియు కేంద్ర హౌంమంత్రి దీనికి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని తీసుకోవాలి. రాజకీయ నాయకత్వం ఈ సంఘటనను స్పష్టంగా ఖండించాలి. రాజ్యాంగ విలువలైన లౌకికవాదం, మత సహనం, చట్టబద్ధమైన పాలనకు, పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ధ్రువీకరించాలి. ఉత్తరాఖండ్‌లోని పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలి. చట్టానికి సంబంధించిన అన్ని నిబంధనలను అమలు చేయాలి. ప్రజా సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించే ఈ ధోరణిని సెక్షన్ ఏ 153 ప్రకారం శిక్షించాలి. ప్రతి చిన్నరాజకీయ విషయాన్ని 'విద్రోహం' మరియు 'ఉగ్రవాదం' అభియోగాల కింద జమకట్టే ప్రభుత్వం ఈ విషయంలో ప్రతిస్పందించక పోవటం గమనార్హం. 'ధరమ్ సన్సద్'లోని ద్వేషపూరిత ప్రసంగాలు మెజారిటీలోని కొంతమందికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాయని కొట్టిపారేయడం సులభం కావచ్చు. కానీ ఈ ప్రసంగాల యొక్క తీవ్రతను, భావజాలాన్ని పరిశీలిస్తే ఇది ఎంత ప్రమాదకరమో అర్ధంచేసుకోవచ్చు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలలోకి విస్తతంగా చేరుతున్న ఈ ప్రసంగాలు మరింత మంది మితవాద వర్గాలకు వ్యాప్తి చెందడానికి ఎంతో సమయం పట్టదు. ఈ ద్వేషపూరిత ప్రచారం గెలవకూడదు. దీనిని వెంటనే నిరోధించాలి.