Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీని రిమోట్‌గా వాడుకుంటున్న కార్పొరేట్ శక్తులు
- జనవరి 15న ఎస్కే ఎం సమావేశం భవిష్యత్పోరాట కార్యచరణ
- దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాలకు సిద్ధం : ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అశోక్ ధావలే, హన్నన్ మొల్లా
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకొస్తే ఆ సవాల్ స్వీకరించడానికి రైతాంగం సిద్ధంగా ఉందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అశోక్ ధావలే, హన్నన్ మొల్లా ప్రకటన విడుదల చేశారు. రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలనే మోడీ ప్రభుత్వం ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేస్తూ నాగ్‌పూర్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన ప్రకటన రైతులు, కార్మికులతో సహా దేశ ప్రజలకు సవాలుగా ఉందని పేర్కొన్నారు. ఈ సవాలు దేశీయ, విదేశీ కార్పొరేట్ శక్తుల తరఫున, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓకు చెందిన అంతర్జాతీయ సామ్రాజ్యవాదుల తరపున ఉన్నదని విమర్శించారు. దేశంలోని రైతాంగం, కార్మికవర్గం ఈ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయనీ, ప్రధాని మోడీ ''కార్పొరేట్ ప్రభుత్వం, కార్పొరేట్ ద్వారా, కార్పొరేట్ కోసం'' ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో దేశవ్యాప్తంగా బలమైన పోరాటాలు జరుగుతాయనీ, అది చివరికి మోడీ ప్రభుత్వాన్ని కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నాయని స్పష్టం చేశారు.
మూడు వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంలో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తన పోరాటాన్ని విరమించుకోలేదనీ, తాత్కాలికంగా నిలిపివేసిందని గుర్తు చేశారు. జనవరి 15న జరిగే తదుపరి ఎస్కేఎం సమావేశంలో చట్టబద్ధంగా హామీ ఇచ్చిన ఎంఎస్పీ (సీ2ం50శాతం) కోసం చట్టం చేయడం, విద్యుత్ (ప్రయివేటీకరణ) బిల్లును ఉపసంహరించు కోవడం, కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా టెనీని తొలగించడం, అరెస్టు చేయడం తో పాటు మిగిలిన డిమాండ్లపై పోరాటాన్ని కొనసాగించడంపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కార్పొరేట్ అనుకూల నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో రైతు, శ్రామికవర్గం ఐక్యంగా సాగిన పోరాటం ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద ఐక్యతను సాధించిందని గుర్తు చేశారు. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక 2022 ఫిబ్రవరి 23, 24ల్లో అఖిల భారత సార్వత్రిక సమ్మెను ప్రకటించిందనీ, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయడం, వ్యవసాయ కార్మికులకు స్థిరమైన ఉపాధి, కనీస వేతనం కోసం సమగ్ర చట్టాన్ని అమలు చేయడంతో సహా ఇతర డిమాండ్లపై ఎస్కే ఎం మద్దతు ఇచ్చిందని తెలిపారు. ప్రయివేటీకరణ ఉద్దేశిం చిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌ను ఆపాలని, ధరల పెరుగుదల నియం త్రించాలని, నిరుద్యోగాన్ని ఆపాలని, పిడిఎస్ రక్షణ చట్టం చేయాలని డిమాండ్లకు ఎస్కే ఎం మద్దతు తెలిపిందని అన్నారు. మోడీ ప్రభుత్వం అనసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా, ప్రజల ప్రయోజనా లను కాపాడేందుకు దేశవ్యాప్తంగా మరిన్ని పోరాటాలు జరగనున్నాయని స్పష్టం చేశారు.